భోగి మంటల్లో ఎస్మా, షోకాజ్‌ నోటీసులు

Jan 14,2024 17:20

బోగి మంటల్లో జీవో ప్రతులను దగ్ధం చేస్తున్న అంగన్వాడీలు

భోగి మంటల్లో ఎస్మా, షోకాజ్‌ నోటీసులు
– సిఎం, మంత్రి, సజ్జల పోస్టర్లు దగ్ధం
– వినూత్న రీతిలో అంగన్‌వాడీల నిరసన
– 34వ రోజూ అంగన్వాడీల నిరవధిక సమ్మె
ప్రజాశక్తి – విలేకరులు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీల సమ్మె 34వ రోజు ఆదివారం కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీలు వినూత్నరీతిలో భోగి మంటల్లో ఎస్మా జీవో 2 కాపీలను, షోకాజ్‌ నోటీస్‌లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పోస్టర్లను బోగి మంటల్లో కాల్చి నిరసన తెలిపారు. ‘ఇవి బోగి మంటలు కాదు.. మా ఆకలి కేకల మంటలు.. పండుగ రోజు కూడా మమ్మల్ని రోడ్లపై కూర్చోబెట్టిన ఘనుడు సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. మా జీతాలు పెంచమంటే ప్రభుత్వం, మంత్రులు, సలహాదారులు ఆర్ధిక సమస్యలని చెబుతున్నారు. మరి సజ్జలకెందుకు నెలకు లక్షల రూపాయలు ఇస్తున్నారు..? సజ్జల ప్రభుత్వానికి ఉచిత సేవలు చేయొచ్చు కదా..? ప్రభుత్వ సలహాదారు పదవి నుండి సజ్జలను తక్షణమే తప్పించి నేరుగా సిఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చర్చలు జరపాలి’ అని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు డిమాండ్‌ చేశారు.
నంద్యాల కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల నిరవధిక సమ్మె 34వ రోజు ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షా శిబిరం వద్ద భోగి మంటలు వేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఎస్మా జీవో ప్రతులను, షోకాజ్‌ నోటీసుల ప్రతులను, ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ పోస్టర్లను బోగి మంటల్లో వేసి కాల్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.నాగరాజు, పట్టణ అధ్యక్షులు డి.లక్ష్మణ్‌, అంగన్వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.నిర్మలమ్మ, ప్రాజెక్ట్‌ కార్యదర్శి సునీత, జిల్లా సహాయ కార్యదర్శి నాగరాణిలు మాట్లాడుతూ ఎస్మాలకు, షోకాజ్‌ నోటీసులకు భయపడేది లేదని, ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎదుర్కొంటామని, సజ్జల తాటాకు చప్పళ్లకు బెదిరేవారు ఎవరూ లేరన్నారు. అనంతరం దీక్షా శిబిరంలోనే అంగన్వాడీ కేంద్రాల్లోని ఫ్రీ స్కూల్‌ పిల్లలకు బోగి పళ్లు పోసి బోగి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రసన్న, రాధాకృష్ణవేణి, వరలక్ష్మి, నాగేశ్వరి, ఆయాలు నాగమ్మ, హరిత, మదార్‌ బీ, మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూరు : పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు 34వ రోజు సమ్మెలో భాగంగా భోగి మంటల్లో ఎస్మా జీవోను దగ్ధం చేసి నిరసన తెలిపారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఏసురత్నం, పట్టణ కార్యదర్శి రామ్‌ నాయక్‌, ఉపాధ్యక్షులు రణధీర్‌, ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ప్రాజెక్టు కార్యదర్శి మంజుల, కోశాధికారి లక్ష్మీదేవిలు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్‌ చేశారు. వ్యకాసం జిల్లా సహాయ కార్యదర్శి స్వాములు, సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్‌, నాయకులు సురేంద్ర, అంగన్వాడీలు ప్రమీలమ్మ, లక్ష్మీదేవి, ప్రియాంక, వెంకటలక్ష్మి, రవణమ్మ, చెన్నమ్మ, తదితరులు పాల్గొన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో జీవో 2 ప్రతులు దగ్ధం : ఎస్మా జీవో 2ను రెండు రద్దు చేయాలంటూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవో కాపీలను దగ్ధం చేసి అంగన్‌వాడీలకు మద్దతు తెలిపారు. సిపిఎం పట్టణ కార్యదర్శి ఏ.రణధీర్‌ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు రోడ్డుపైనే సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారంటే ప్రభుత్వానికి వారిపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుందన్నారు. సిపిఎఓం పట్టణ నాయకులు రామ్‌ నాయక్‌, నాగేశ్వరరావు, సురేంద్ర, దినేష్‌, ఐద్వా నాయకురాలు దాసమ్మ, స్వర్ణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రేమ్‌తో పాటు కాలనీ మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. పాములపాడు : షోకాజ్‌ నోటీసులను భోగిమంటల్లో అంగన్వాడీలు దగ్ధం చేసి నిరసన తెలిపారు. అంగన్‌వాడీ యూనియన్‌ నాయకురాలు శివలక్ష్మి, రమణమ్మ బారు, నాగ మద్దమ్మ, నాగమణి, శ్రీలత, టీచర్స్‌, హెల్పర్స్‌ పాల్గొన్నారు. అంగన్వాడీల సమ్మెకు విలేజ్‌ బుక్‌ కీపర్స్‌ (వివోఏ)ల సంఘం పూర్తి మద్దతు తెలిపింది. సంఘం గౌరవ అధ్యక్షులు తిరుపతయ్య, కార్యదర్శి తిక్క స్వామి, అధ్యక్షులు నాగప్ప, సిపిఎం మండల కార్యదర్శి సామన్న, నాయకులు వెంకటేశ్వరరావు, రంగస్వామి, బాల యేసు, సురేష్‌, చెన్నయ్య, రజక సంఘం మండల కార్యదర్శి రామకకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. రుద్రవరం : తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు షోకాజ్‌ నోటీసులను భోగి మంటల్లో వేసి, భోగి మంట చుట్టూ నృత్యం చేస్తూ నిరసనను తెలిపారు. నందికొట్కూరు టౌన్‌ : పట్టణంలోని ఐసిడిఎస్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ఎస్మా జీవో 2 కాపీలను భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన తెలిపారు. వ్యకాసం జిల్లా అధ్యక్షుడు ఎం.నాగేశ్వరావు జిల్లా నాయకులు పి.పకీర్‌ సాహెబ్‌, సిఐటియు పట్టణ కార్యదర్శి టి.గోపాలకృష్ణ, మండల అధ్యక్షుడు ఆంజనేయులు, నాగన్న, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్‌ యూనియన్‌ నాయకురాలు మదర్‌ బి మాట్లాడారు. యూనియన్‌ నాయకులు ఉమాదేవి, లక్ష్మీదేవి, హరిత, కీర్తి, రజియా, నాగమ్మ, రాజేశ్వరి, భాగ్యలక్ష్మి, శాంత, లలితమ్మ, గొర్రెల మేకల సంఘం జిల్లా నాయకులు ఎస్‌.రామ సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తపల్లి : కొత్తపల్లి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు భోగి మంటల్లో ఎస్మా జీవోను దగ్ధం చేశారు. అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా నాయకురాలు ఈ.హరిత, నాగమణి, రమణమ్మ, శ్రీదేవి, నాగమణి, ప్రభావతి, పద్మావతి, సుభాషిని, వసంత, శ్రావణి, పార్వతి, సుగుణ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. పగిడ్యాల : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఆవరణలో అంగన్వాడిలు ఎస్మా కాపీలను భోగిమంటల్లో వేసి దగ్గం చేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్‌ రెడ్డి, అంగన్వాడీలు సాజిదాబి, వరలక్ష్మి, రాములమ్మ, పద్మావతి, ప్రభావతమ్మ, భాస్కరమణి, నారాయణమ్మ పాల్గొన్నారు. చాగలమర్రి : స్థానిక కేరళ ఆసుపత్రి ఎదురుగా అంబేద్కర్‌ సర్కిల్లో నాయకులు పద్మావతి, నాగమణి, వసంత, వై పద్మావతి, సంజమ్మ, చంద్రకళ, వహీదా, హసీనా, ఇందుమతిల ఆధ్వర్యంలో ఎస్మా జీవో కాపీలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేశారు. టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్‌ ఉపాధ్యక్షులు భాష, ముల్లా గఫార్‌ ముల్లా ఆజీమ్‌, హనీఫ్‌, గుత్తి నరసింహులు, షరీఫ్‌, అబ్దుల్లా, అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ నాయకులు మాబుచాన్‌, రెహనా, గురమ్మ, నసీమన్‌, జ్యోతి, ఆస్థానమ్మ పాల్గొన్నారు. మహానంది : మహానందిలోని తహశీల్దార్‌ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు షోకాజ్‌ నోటీసులను భోగి మంటల్లో కాల్చి నిరసన తెలిపారు. దీక్షా శిబిరం వద్ద అంగన్వాడిలు సంక్రాంతి వేడుకలు నిర్వహించి, సమస్యలను గొబ్బి పాటల రూపంలో పాడుతూ నిరసన తెలిపారు. అంగన్వాడీలు చండీ దేవి, సావిత్రి, నారాయణమ్మ, జ్యోతి ఉషారాణి, ఖైరున్‌, గౌరీ, మహేశ్వరి, పుష్పకళ, తదితరులు పాల్గొన్నారు.

➡️