మల్లన్న సన్నిధిలో సుప్రీం కోర్టు జడ్జి

Dec 18,2023 19:47

సుప్రీం కోర్టు జడ్జి హిమా కోహ్లీకి పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న వేద పండితులు

మల్లన్న సన్నిధిలో సుప్రీం కోర్టు జడ్జి

ప్రజాశక్తి – శ్రీశైలం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి హిమా కోహ్లీ కుటుంబ సమేతంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని సోమవారం నాడు దర్శించుకున్నారు. శ్రీకృష్ణ దేవరాయ గోపురం వద్దకు చేరుకొన్న వారికి ఆలయ కార్యనిర్వహణా ధికారి పెద్దిరాజు, ఏఈఒలు, ఉబయ దేవాలయాల ప్రధాన అర్చకులు, వేదపండితులు, సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. అనంతరం ముందుగా స్వామివారిని ఆ తరువాత అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేద పండితులు వేద ఆశీర్వచనములు పలకగా శేష వస్త్రాలను ప్రసాదాలను జ్ఞాపికను ఏఇఒ మోహన్‌ అందజేశారు.

➡️