రాష్ట్రవ్యాప్త ‘ఆడుదాం-ఆంధ్ర’ లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు..

Dec 26,2023 16:43
క్రీడాకారులకు క్రీడ వస్తువులు పంపిణీ చేస్తున్న దృశ్యం

రాష్ట్రవ్యాప్త ‘ఆడుదాం-ఆంధ్ర’ లాంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా లేదు..

రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, జడ్పిటిసి పుల్యాల దివ్య, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి

ప్రజాశక్తి – పగిడ్యాల
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం దేశంలో ఎక్కడా నిర్వహించడం లేదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, జడ్పిటిసి పుల్యాల దివ్య, మాజీ జెడ్పిటిసి పుల్యాల నాగిరెడ్డి,   ఎంపీపీ మండ్ల మల్లేశ్వరి, అన్నారు. మంగళవారం మండలంలోని వివిధ సచివాలయాల పరిధిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నో పథకాలను  ప్రవేశపెట్టారని అందులో భాగంగానే ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను నిర్వహించే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఎంతో మంది ప్రతిభగల క్రీడాకారులు ఉన్నారని సరియైన ప్రోత్సాహం లేక వారి ప్రతిభ మరుగున పడిపోతుందన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాల ప్రతిభ మరుగున పడకుండా సీఎం జగనన్న ఆడుదాం ఆంధ్ర పోటీలను నిర్వహిస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో గ్రామీణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికి తీసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని అన్నారు. ఆంధ్ర కార్యక్రమానికి రూ 100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ప్రతి క్రీడాకారుడు   క్రీడా స్ఫూర్తితో పోటీలో పాల్గొనాలన్నారు. గెలుపోటములు సమానంగా స్వీకరించినప్పుడే విజయం వరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరుమాళ్ళ శేషన్న, ఎంపీడీవో వెంకటరమణ, తహశీల్దార్ భారతి, ఎంఈఓ సుభాన్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుసూదన్ రావు, పిడి కృష్ణ, పంచాయతీ కార్యదర్శి ఉపేంద్ర రెడ్డి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.
➡️