వైసిపి విజయాన్ని ఎవరూ ఆపలేరు : వైసిపి అభ్యర్థి నిసార్‌ అహ్మద్‌

ప్రజాశక్తి – రామసముద్రం (రాయచోటి-అన్నమయ్య) : మండలంలోనిమధనపల్లె నియోజకవర్గం మాలేనత్తం, మినికి పంచాయతీల గ్రామాల్లో జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు కొండూరు క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గ వైసిపి అభ్యర్థి నిసార్‌ అహ్మద్‌ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు కొండూరు క్రిష్ణారెడ్డి లు మాట్లాడుతూ … ఎన్ని పార్టీలు ఒక్కటై వచ్చినా రాష్ట్రంలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీనే వచ్చేదని, కాబోయే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డే అని ఆయన అన్నారు. ఎందుకంటే మాట చెప్పితే తప్పేదే లేదని, రాష్ట్రంలో జగన్‌ మోహన్‌ రెడ్డి పరిపాలించిన విధానం గురించి వివరిస్తూ, ఎవ్వరూ ఆఫీసులు చుట్టూ తిరగకూడదని వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చారని అన్నారు. యాబై ఇండ్లకు ఓ వాలంటరీని పెట్టి ఉచితంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా ఇంటివద్దకే చేరాలనే ఆలోచనతో ఈ వాలంటరీల పథకాలు అమలు అందచేస్తున్నారని అన్నారు. వాలంటీర్లుకు గౌరవ వేతనం ఐదు వేలు, ఆపైన ఉత్తమ సేవలు అందించిన వారికి సేవా పథకాలతో పాటు ఆర్థికంగా ఆదుకున్నారని అన్నారు. నాడు నేడు ద్వారా పాఠశాలలను దాదాపు 20 వేల కోట్ల రూపాయల పైన ఖర్చు చేసి పాఠశాలల రూపురేఖలు మార్చేయడం కూడా జరిగింది.అలానే వైద్యశాలల్లో కూడా పూర్తి స్తాయిలో మందులు, సిబ్బంది కి కొదవలేకుండా, వైద్యసేవలు అందించారు.అలానే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి అన్ని సేవలు ప్యామిలీ డాక్టర్‌ ద్వారా పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్న విషయం మనకు తెలిసిందేనని అన్నారు. ఐదు సంవత్సరాల పరిపాలన జరిగిన అందులో రెండు సంవత్సరాల కాలం కరోనాతో రాష్ట్రం ఆర్థికంగా చితికల పడిన,ఓ పక్క ప్రజ, లకు ఆరోగ్యం కాపాడుకుంటూ, మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో మన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఒక్కడే అని ఆయన అన్నారు. కనుక ఈనెల 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేయుచున్న పార్లమెంట్‌ అభ్యర్థి మిథున్‌ రెడ్డి కి ప్యాన్‌ గుర్తుపై ఒక ఓటు, మధనపల్లె నియోజకవర్గం నుంచి వైసిపి తరపున పోటీ చేయుచున్న అసెంబ్లీ అభ్యర్థి అయిన నాకు ఫ్యాన్‌ గుర్తుపై వేసి నన్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ ప్రచారంలో ఆయనతో పాటు ఎంపిపి కుసుమ కుమారి, సింగిల్‌ విండో అధ్యక్షుడు కేశవరెడ్డి, వైస్‌ ఎంపిపి వెంకటరమణ రెడ్డి,జయరామిరెడ్డి, సుబ్బారెడ్డి,జిల్లా బిసి వైసిపి ప్రధాన కార్యదర్శి బాలాజీ,గెవన్న, హరిప్రసాద్‌, మాజీ ఎంపిటిసి గెంగిరెడ్డి, శేషు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️