మోకాళ్లపై నిలబడి నిరసన

Dec 14,2023 22:55

మూడోరోజుకు చేరిన అంగన్వాడీల సమ్మెనినాదాలతో హోరెత్తిన ధర్నా చౌక్‌

ప్రజాశక్తి – విజయవాడ :ున్యాయమైన అంగన్‌వాడీల డిమాండ్లను పరిష్కరించకుంటే సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి మహిళలు ‘రిటన్‌గిప్ట్‌’ ఇవ్వాల్సి వస్తుందని పలు సంఘాల నేతలు హెచ్చరించారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో అంగన్‌వాడీలు ధర్నా చౌక్‌లో నిర్వహిస్తున్న సమ్మె గురువారానికి మూడో రోజుకు చేరింది. ్తందని పన్యాయyఅంగన్‌వాడీలు చేస్తున్న పోరాటానికి ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు, ఉద్యోగ, ఉపాధ్యాయ, సిఐటియు, ఇతర సంఘాల నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి సమ్మెకు సంపూర్ణ సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలు చేసిన నినాదాలు హోరెత్తాయి. కార్యక్రమానికి యూనియన్‌ జిల్లా అధ్యక్షులు టి.గజలక్ష్మీ అధ్యక్షత వహించారు. సమ్మెనుద్దేశించి ఎమ్మెల్సీ కెఎస్‌.లక్ష్మణరావు మాట్లాడుతూ రూ.26 వేలు వేతనంతో పాటు గ్రాట్యూటీ, ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మూడు రోజుల నుంచి అంగన్‌వాడీ వర్కర్స్‌ ఆందోళన చేస్తుంటే సంబంధిత యూనియన్‌ నేతలను చర్చలకు పిలిచి, పరిష్కరించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించకుండా, అంగన్‌వాడీ సెంటర్లను వాలంటీర్లతో పని చేయించాలని ప్రభుత్వం యోచిస్తుండటం దారుణమన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్ఫర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలకున్న తాళాలను ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వం ఆదేశాలతో అధికారులు పగలకొడ్తున్నారని, ఇటువంటి చర్యలు మనుకోకపోతే తగిన బుధ్ది చెప్పాల్సి వస్తోందని హెచ్చరించారు. యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, ఎఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఎన్‌జిఒ సంఘం పశ్చిమ కృష్ణా అధ్యక్షులు ఎ.విద్యాసాగర్‌ మాట్లాడుతూ అంగన్‌వాడీలు చేస్తున్న పోరాటానికి ఉద్యోగ సంఘాలు అండగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ సుప్రజ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీదేవి, ఐద్వా నాయకులు, మాజీ కార్పొరేటర్‌ జి.ఆదిలక్ష్మీ, సిఐటియు సెంట్రల్‌ సిటీ అధ్యక్ష, కార్యదర్శులు కె.దుర్గారావు, ఎంవి సుధాకర్‌, యూనియన్‌ కోశాధికారి జయనీ రత్నకుమారి,నాయకులు పాల్గొన్నారు. మైలవరం : అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ధర్నా కార్యక్రమం గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద మూడో రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా అంగన్వాడీలు కళ్ళకు గంతలు కట్టుకొని, ఆటపాటలతో తమ నిరసనను తెలియజేశారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వర రావులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మైలవరం, జి కొండూరు, ఇబ్రహీంపట్నం సిఐటియు మండల కార్యదర్శి లు సిహెచ్‌ సుధాకర్‌, కే బాలకష్ణ, ఎం మహేష్‌, సిపిఎం మైలవరం మండల కార్యదర్శి రావూరి రమేష్‌ బాబు, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రావుల సుబ్బారావు, పాల్గొన్నారు. తిరువూరు : అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సమ్మెకు తెలుగుదేశం, జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలతో పాటు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా నాయకులు రవి చంద్ర గురువారం సంపూర్ణ మద్దతు తెలిపారు. జగ్గయ్యపేట: జగ్గయ్యపేట తహశీల్దార్‌ కార్యాలయం ముందు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో 3వ రోజు గురువారం మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగవాడీల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా జాప్యం చేస్తున్నాయని, వేతనాలు పెంచాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అములు చేయాలని, ఇతర సమస్యలపై అనేక మార్లు ప్రభుత్వానికి, అధికారులకు,అంగన్వాడీల సమస్యలు పరిష్కారం కాలేదని ఈ నేపథ్యంలోనే నిర్వహిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. వీరులపాడు : జుజ్జూరు మండల కేంద్రంలో అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజుల నుంచి వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టారు. నందిగామ : మండలంలో మూడో రోజు కొనసాగిన సమ్మెలో అంగన్‌వాడీలు మోకాళ్లపై నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. సిఐటియు మండల కార్యదర్శి కటారపు గోపాల్‌, తదితరులు మద్దతుగా నిలిచారు.అంగన్వాడీ కేంద్రాల తాళాలు ఇబ్రహీంపట్నం: ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సూపర్‌ వైజర్‌ గురువారం ఐసిడిఎస్‌ అధికారులు కొండపల్లి మున్సిపల్‌ కమీషనర్‌ పర్యవేక్షణలో ఇబ్రహీంపట్నంలో ఎమ్‌ పిడిఓ ఆధ్వర్యంలో కొండపల్లిలోని 6 సెంటర్‌ లు, దొనబండలో 3సెంటర్‌ లు, దాములూరు 2 సెంటర్‌ లు తాళాలు పగుల గొట్టి కొత్త తాళాలు వేశారు. ఈ విషయాన్ని ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సూపర్‌ వైజర్‌ రమాదేవి తెలిపారు. కలెక్టర్‌ వద్ద నుండి వచ్చిన ఆదేశాల మేరకు సెంటర్లు తెరిచినట్లు తెలియజేశారు. సమస్య పరిష్కారం చేయకుండా వైసిపి ప్రభుత్వం అంగన్వాడీ స్కూల్‌ తాళాలు పగుల కొట్టడం, బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గం అని సిఐటియు మండల కార్యదర్శి యం మహేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు : అంగన్వాడీ కేంద్రం తాళాలు పగలు గొట్టి సచివాలయం సిబ్బందితో వాలంటీర్లతో కేంద్రాన్ని తెరిచారు. అంగన్వాడీ సెంటర్‌ 6లో తాళాలు పగలికొట్టి అంగవాడి సెంటర్‌ తెరిచారు. మండల తహసీల్దార్‌. కె.లక్మి కల్యాణి వైద్య అధి కారి, ఇందిరా, మండల రెవెన్యూ అధికారులు, పంచా యతీ సెక్రెటరీ జి శ్యామ్‌ కుమార్‌.గ్రామ రెవెన్యూ అధికారులు, మహిళ పోలీసులు, ఐసీడీసీ సూపర్‌ వైజరు, పాల్గొన్నారు. విస్సన్నపేట : విస్సన్నపేట మండలంలోని అంగన్‌ వాడి కేంద్రాల్లో టీచర్స్‌ ఆయాలు సమ్మె నిర్వహిస్తున్నారని మండలంలోని అంగన్వాడీ కేంద్రాలన్నింటిని సచివాలయ సిబ్బందికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటరమణ, ఎంఈఓ సుధాకర్‌, సచివాలయ సిబ్బంది,పంచాయతీ సెక్రెటరీ పాల్గొని అంగన్వాడి కేంద్రాలలోని టీచర్స్‌ యొక్క రిజిస్టర్లను, స్టాక్‌ ను స్వాధీన పరుసుకున్నారు.

➡️