192 మద్యం సీసాలు స్వాధీనం

Apr 21,2024 21:52

ప్రజాశక్తి – జగ్గయ్యపేట: జగ్గయ్యపేట ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలోని మండలంలోని అన్నవరం గ్రామ సమీపంలోని ద్విచక్ర వాహనంపై తెలంగాణ రాష్ట్రం రామాపురం ఎక్స్‌ రోడ్‌ నుండి ఆంధ్రాకు అక్రమంగా తరలిస్తున్న 192 మద్యం సీసాలు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన ఉయ్యాల శ్రీనివాసరావు ద్విచక్ర వాహనంపై మద్యం సీసాలను తీసుకెళ్తుండగా పట్టుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.77,315లు అని, మద్యం సీసాలను, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేసి శ్రీనివాసరావును అరెస్ట్‌ చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ పోలీసులు తెలిపారు.

➡️