అగ్ని ప్రమాదాలపై అవగాహన

Apr 17,2024 22:25

 ప్రజాశక్తి – విసన్నపేట : గ్యాస్‌ లీక్‌ అయి ప్రమాదం జరిగినప్పుడు దాని నుండి ఎలా కాపాడుకోవాలో స్థానిక వాసవి ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీ సిబ్బంది అవగాహన కల్పించారు. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా గ్యాస్‌ ఏజెన్సీ కార్యాలయంలో ఆఫీస్‌, డెలివరీ సిబ్బందికి తెలిపారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎలా అదుపు చేయాలో నివారణ చర్యలు ఎలా తీసుకోవాలో చెప్పారు. ఫైర్‌ ఆఫీసర్‌ బి.నానిక ఆధ్వర్యంలో అగ్నిప్రమాదంలో జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు.

➡️