నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలు

Apr 21,2024 21:50
  • పంట పొలాలు సైతం ఇటుకల కర్మాగారాలే

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండల పరిధిలో ఇటుక బట్టీల కోసం, సాగుచేసే సారవంతమైన పంట పొలాలను నిస్సారంగా మార్చిడం వలన, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండలంలోని ఎంతో సారవంతమైన పంట భూములను, ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుకలు తయారీ కోసం ఉపయోగించటం వల్ల భూమి సారం నశించి భూమి ఏ పంటకు ఉప యోగ పడద నీ, తద్వారా భవిష్యత్తులో ఆహార కొరత ఏర్పడుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం, ధనార్జనే ధ్యేయంగా జరుగుతున్న ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు తీసుకునే అవకాశం కూడా లేదనిపిస్తుంది. పంట పొలాలు, మామిడి తోటల మధ్య ఇలాంటి ఇటుక తయారీ బట్టీలను ఏర్పాటు చేయడం వల్ల బట్టీని కాల్చే సమయంలో వచ్చే పొగ వల్ల చుట్టుపక్కల ఉన్న పంటలు దెబ్బతింటునాయనీ, ఈ బట్టీలు ఆర్‌అండ్‌బి రహదారికి ఇరువైపులా అతి సమీపంలో ఉండటం వల్ల కూడా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.పొగవలన పొంచి ఉన్న పెనుప్రమాదంఈ ఇటుక తయారీ కేంద్రాలు ఊరుకి సమీపంలో ఉండటం వల్ల ఇటుకల తయారు కోసం నిల్వ ఉన్న బూడిద, వరిపొట్టు, పొగ వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పొగ పీల్చిన వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయని ముఖ్యంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘించి, అనుమతి లేకుండా, విచ్చల విడిగా పుట్టుకొస్తున్న ఇటుక బట్టీల వలన ప్రకతి కి విఘాతం కలిగించి, భవిష్యత్తులో విపత్తు కలిగించే విధంగా ఉన్న ఇటుక బట్టీల వారికి అధికారులు తగిన అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో భవిష్యత్తులో ఎంతో పచ్చగా ఉన్న పంట పొలాలు ఎడారిలా మారి ధాన్యంపు కొరత ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా పుట్టగొడుగుల్లా ఏర్పాటు అవుతున్న ఇటుక బట్టీ తయారిని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీనిపై త్వరలోనే ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు చేపట్టకపోతే పచ్చని పంట పొలాలు ఎడారిలా మారి ఆహార ధాన్యాల ఉత్పత్తి లేక కరువు ప్రాంతంగా మారే ప్రమాదం ఉంది. కనుక అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

➡️