బాటిళ్లలో పెట్రోలు విక్రయించొద్దు

May 19,2024 21:01
  • సిఐ చంద్రశేఖర్‌

ప్రజాశక్తి – కంచికచర్ల : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు బాటిళ్లు, కంటైనర్లలో, ఇతర ఏ పద్ధతుల్లో లూస్‌ పెట్రోల్‌ విక్రయించొద్దని పెట్రోల్‌ బంక్‌ డీలర్లకు నందిగామ రూరూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ ఆదేశించారు. కంచికచర్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెట్రోల్‌ బంక్‌ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు లూస్‌ పెట్రోల్‌ విక్రయించకుండా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా లూస్‌ పెట్రోల్‌ విక్రయించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా కస్టమర్‌ దారిలో బండి ఆగిపోయిందని బాటిల్‌ తీసుకువచ్చి పెట్రోల్‌ కొట్టమంటే బంకు సిబ్బందిని ఇచ్చి కస్టమర్‌కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దగ్గరుండి పెట్రోల్‌ పోసి రావలసిందిగా బంక్‌ యాజమానులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో కంచికచర్ల ఉమెన్‌ ఎస్‌ఐ హైమావతి తదితరులు పాల్గొన్నారు.

➡️