ఉత్సాహంగా జిల్లా స్థాయి చెస్‌ పోటీలు –

May 12,2024 19:01
  •  రాష్ట్రస్థాయి పోటీలకు నలుగురు ఎంపిక

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : కృష్ణాజిల్లా చెస్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో పోరంకిలోని గ్రీన్‌ స్కూల్‌లో జిల్లా స్థాయి ఓపెన్‌, ఉమెన్‌ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు ఆదివారం ఉత్సాహభరితంగా జరిగాయి. పోటీలు ఎస్‌ఆర్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించగా ఓపెన్‌ కేటగిరిలో 46 మంది క్రీడాకారులు, ఉమెన్‌ క్యాటగిరిలో 17 మంది పాల్గొన్నారని కృష్ణా జిల్లా చెస్‌ అసోసియేషన్‌ సెక్రటనీ ఎన్‌.ఎం.ఫణికుమార్‌ తెలిపారు. ఉమెన్‌ వింగ్‌లో ఎంపికైన మొదటి నలుగురు క్రీడాకారులు ఈ నెల 25, 26 తేదీల్లో సత్యసాయి జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి మహిళా చెస్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలలో కృష్ణా జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఓపెన్‌ కేటగిరిలో ఎంపికైన నలుగురు క్రీడాకారులు ఈనెల 27, 28 తేదీలలో ఎన్‌టిఆర్‌ జిల్లాలో జరిగే ఓపెన్‌ చెస్‌ రాష్ట్రస్థాయి పోటీలలో కృష్ణా జిల్లా జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఓపెన్‌ కేటగిరిలో రుశీల్‌ సాయి, బి.టి.జీవితేష్‌, జగదీష్‌బాబు, రోహన్‌ .ఎస్‌. నలుగురు క్రీడాకారులు విజేతలుగా నిలిచారని తెలిపారు. ఉమెన్‌ కేటగిరిలో….పి.నవ్య సాహితి, పి.గీతిక, ఏ. అక్షయ, ఎం.నాగ శుభశ్రీ, విజేతులుగా నిలిచారన తెలిపారు. ఓపెన్‌ కేటగిరి అండర్‌ -7 విభాగంలో బి.గోకుల్‌ నందన్‌ రెడ్డి, అయాన్ష్‌ శర్మ విజేతలుగా నిలవగా, అండర్‌ -9 విభాగంలో ఏ.శ్రేయష్‌, వై.మోక్షిత్‌ రామ్‌ , అండర్‌ -11 విభాగంలో ఏ.సుహాష్‌, కె.సంవిత్‌, అండర్‌ -13 విభాగంలో పి.జయతేజ, కె.సాయి సాత్విక్‌లు విజేతలుగా నిలిచారని తెలిపారు. అండర్‌ -15 విభాగంలో ఎస్‌.జైప్రసన్న, ఎం.జితేష్‌ నాగ్‌, ఉమెన్‌ అండర్‌ -9 విభాగంలో పి.మేఘన, అండర్‌ -11 విభాగంలో కె.వీక్షణ, జి.వైష్ణవి విజేతలుగా నిలిచారని తెలిపారు. అండర్‌ -13 విభాగంలో ఎం.గీతా మాధురి, కె.కావ్యశ్రీ, అండర్‌ -15 విభాగంలో డోయల్‌ నాయుడు, విజేతులుగా నిలిచారని తెలిపారు. ఆన్‌లైన్‌లో జరిగిన పోటీలలో ఎస్‌.రోహన్‌, బి.వశిష్ట, శ్రేయస్‌, ఎం.జితేష్‌ నాగ్‌లు విజేతలుగా నిలిచారన్నారు. ఈసందర్భంగా సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో విజేతలకు ఎస్‌ఆర్‌ఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్టు డైరెక్టర్‌ కె.ఈశ్వరి, సాప్టువేర్‌ ఉద్యోగి కె.శ్వేత, అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ కె.శ్రావణి, కృస్ణాజిల్లా చెస్‌ అసోసియేషన్‌ మేనేజర్‌ జి.రామకృష్ణ, గుడివాడ చెస్‌ అసోసియేషన్‌ మేనేజర్‌, టోర్నమెంట్‌ చీఫ్‌ ఆర్భిటర్‌ ఎం.ఈ. సుమన్‌ పాల్గొని విజేతలకు బహుమతులను అందచేశారు.

➡️