కంటి కేన్సర్‌పై అవగాహన

May 19,2024 20:30
  • ఎల్‌విపిఇఐ ఆధ్వర్యంలో వైట్‌థాన్‌ వాక్‌

రెటినోబ్లాస్టోమా అనే కంటి కేన్సర్‌పై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఎల్‌ వి ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ (ఎల్వీపీఈఐ) ఆధ్వర్యంలో వైట్‌థాన్‌ వాక్‌ పేరుతో ఆదివారం నడక కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలోని కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్‌, తాడిగడప వద్ద వైట్‌థాన్‌ వాక్‌ ను జెండా ఊపి ఆ ఆసుపత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్‌ కు సంబంధించి అవగాహన కల్పించుటకు గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఏడాది వైట్‌థాన్‌ పేరిట పరుగు/నడక (రన్నింగ్‌/వాక్‌) కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. కంటి క్యాన్సర్‌ అత్యంత ఖరీదుతో దీర్ఘకాలం నిర్వర్తించవలసిన చికిత్స అని, ఈ ‘వైటాథాన్‌’ నడక ద్వారా సేకరించిన విరాళాలు రెటినోబ్లాస్టోమా చికిత్స అవసరమైన ఆర్ధిక స్థితిలేని పిల్లలకు ఉచిత చికిత్స అందించేందుకు, ఈ వ్యాధిపై పరిశోధనలకు ఉపయోగిస్తున్నామన్నారు. ‘వైటాథాన్‌’ ద్వారా సేకరించిన నిధులు ఎల్విపిఈఐలో రెటినోబ్లాస్టోమా కంటి కేన్సర్‌తో బాధపడుతున్న 2000 పైబడిన పిల్లలకు చికిత్సకు వినియోగించనున్నామన్నారు. గత దశాబ్దంగా, ఎల్విపిఇఐ 2500కు పైగా రోగులకు చికిత్సనందించిందన్నారు. అందులో దాదాపు 60-65 శాతం ఉచితం అని, వార్షికంగా సంస్థ 150 నుంచి 200 కొత్త రెటినోబ్లాస్టోమా కేసులకు చికిత్స చేస్తుందన్నారు. అందులో 40 శాతం మంది తీవ్ర దశలలో 10 శాతం మంది చివరి దశలో ఉంటున్నారన్నారు. సాధారణంగా రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్‌ 3 సంవత్సరాలలోపు వయసున్న పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందనీ, ఈ వ్యాధిని సకాలంలో గుర్తించటంలో జాప్యం సరైన చికిత్స అందకపోవటం వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు. రెటినోబ్లాస్టోమాను ముందుగానే గుర్తించి, చికిత్స చేస్తే, పిల్లల జీవితం, కాంతిని దష్టిని కాపాడవచ్చని తెలిపారు. ఈ వైట్‌థాన్‌ వాక్‌ ఎల్‌.వి.ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ వద్ద ప్రారంభించి 5 కి.మీ, 3 కి.మీ నడక కార్యక్రమం రెండు క్యాటగిరీలలో నిర్వహించారు.

➡️