నిర్లక్ష్యానికి గురైన విజయవాడను మారుద్దాం

Mar 8,2024 15:08 #ntr district, #Vijayawada

ప్రజల కోసం పోరాడే యోధులకు అండగా నిలుద్దాం
ప్రజాశక్తి-అజిత్ సింగ్ నగర్ : విజయవాడ అజిత్ సింగ్ నగర్ శాంతినగర్ 61వ డివిజన్లో ఇంటింటికి కరపత్రాలు సిపిఎం ఆధ్వర్యంలో పంపిణీ చేసిన కార్యక్రమం సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబురావు మాట్లాడుతూ విజయవాడలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి. ప్రజా ప్రతినిధులు మారారు. అయినా సరే విజయవాడ నగర అభివృద్ధికి ఏమీ చేయలేదని ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని ఒక్క పరిశ్రమ లేదు. పదిమందికి ఉపాధి చూపే ఒక పరిశ్రమను పెట్టలేదు. చదువుకున్న యువత ఇతర రాష్ట్రాల దేశ విదేశాలకు పోవాల్సి వస్తుందని నగరంలో సరైన అభివృద్ధి లేదని, బైపాస్ రోడ్డు లేవు విజయవాడ నగరంలో అభివృద్ధి లేదు. కానీ దోమలు మాత్రం విపరీతంగా అభివృద్ధి చెందాయని దోమల నివారించడానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదని దోమల తెరలతో కనీసం ప్రాణాలు కాపాడుకుందాం అనుకుంటే వాటిని కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదని, శాంతినగర్ వాంబే కాలనీ సింగ్ నగర్ ఏరియాలో అనేక ప్రాంతాలలో దోమలు పెరిగిపోయి ఉన్నాయని వాటిని నివారించటం ప్రభుత్వం విఫలమైందని టిడిపికి జనసేన వైసిపికి ఓట్లు వేస్తే దేశాన్ని ముంచిన బిజెపికి వేసినట్లని మోడీకి మద్దతు పలుకుతున్న జనసేన చంద్రబాబు నాయుడు, వైసీపీలను ఓడించాలని రాష్ట్రం కోసం, జనం కోసం పాలకులపై నిరంతరం పోరాటం సాగిస్తున్న సిపిఎం కమ్యూనిస్టు గెలిపించాలని కోరారు. పార్టీలు మార్చే నేతలకు బుద్ధి చెప్పాలని, రెండు సార్లు బిజెపి-మోడీ గెలిస్తే గ్యాస్ రేట్లు 1200 అయ్యిందని, మూడోసారి గెలిస్తే గ్యాస్ బండ 2000 రూపాయలు వెళుతుందన్నారు. అందుకే బిజెపి మోడీని గద్దించాలని, బిజెపితో జతకట్టే తెలుగుదేశం జనసేన వైసీపీలో ఓడించాలని అన్నారు. ఒకే మాట – ఒకే బాట – ఒకే సిద్ధాంతం జనం కోసం పోరాడే సిపిఎం, కమ్యూనిస్టులు గెలిపించాలని,  దేశాన్ని ముంచిన రాష్ట్రాన్ని వంశించిన బిజెపి మోడీని ఓడించాలని కమ్యూనిస్టులకు ఒక్క అవకాశం ఇవ్వాలని తెలియజేశారు.

➡️