రేపు మాగ్నోవా మెగా ఈవెంట్‌

Apr 14,2024 22:46

ప్రజాశక్తి – ఎడ్యుకేషన్‌ : విద్యార్థుల్లో ఆల్‌రౌండర్‌ నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా మాగ్నోవా-2కె24 మెగా ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు పర్వతనేని బ్రహ్మయ్య సిద్దార్థ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మేకా రమేష్‌ తెలిపారు. ఈ విషయమై ఆదివారం ఉదయం కళాశాలలోని సెమినార్‌ హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాగ్నోవా-2కె24 మెగా ఈవెంట్‌ బ్రోచర్‌ను విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ మేకా రమేష్‌ మాట్లాడుతూ, గడచిన రెండు దశాబ్ధాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా కళాశాల బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగం ఆధ్వర్యంలో గడచిన నిర్వహిస్తున్న మాగ్నోవా ఈవెంట్‌ను ఈ నెల 16న (మంగళవారం) ఉదయం నుంచి సాయంత్రం వరకు సిద్ధార్థ ఆడిటోరియంలో అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈవెంట్‌కు రాష్ట్రవ్యాప్తంగా 30 కళాశాలలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు హాజరై పలు అంశాల్లో తమ ప్రతిభను చాటుతూ పోటీ పడతారని పేర్కొన్నారు. ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా కెనరా బ్యాంక్‌ విజయవాడ జనరల్‌ మేనేజర్‌ పి.రవివర్మ హాజరవుతారని తెలిపారు. బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాధిపతి కె.వి.రమేష్‌ చంద్ర మాట్లాడుతూ, మాగ్నోవా ఈవెంట్‌లో భాగంగా అబౌట్‌ కాలేజ్‌, సమ్స్‌ మాగ్నోవా, మాస్టర్‌ మైండ్స్‌ (యంగ్‌మేనేజర్‌), బిజ్‌బ్లాస్ట్‌ (బిజినెస్‌ ప్లాన్‌), బిజినెస్‌ బ్రెయిన్‌ బాటిల్‌(బి క్విజ్‌), మార్కెట్‌ మేకర్స్‌, మిస్టర్‌ అండ్‌ మిస్‌ మాగ్నోవా, ఐపీఎల్‌ ఆక్షన్‌, నెల్స్‌ రీల్‌ ఇట్‌(రీల్‌ మేకర్‌) వంటి 9 అంశాల్లో విద్యార్థుల మధ్య పోటీలు జరుగుతాయన్నారు. బ్రోచర్‌ ఆవిష్కరణలో కశాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, డీన్‌ ప్రొఫెసర్‌ రాజేష్‌ సి జంపాల, ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యులు కె.విజరు, డాక్టర్‌ కె.శ్రీనివాసులు, పి.కిషోర్‌, విద్యార్థులు పాల్గొన్నారు

➡️