పలుచోట్ల సుందరయ్య వర్థంతి

May 19,2024 20:29

 ఆయా డివిజన్లలో సిపిఎం, సిఐటియు, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పీడిత ప్రజల ఆశాజ్యోతి, దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. సిపిఎం శ్రేణులతో పాటు సిఐటియు అనుబంధ ముఠా, ఆటో, హాకర్స్‌, బిల్డింగ్‌ వర్కర్స్‌, మునిసిపల్‌ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వాడ వాడలా సుందరయ్య వర్ధంతి కార్యక్రమాలు విస్తృతంగా జరిగాయి.

ముఠా, హాకర్స్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో బీసెంట్‌ రోడ్డు, అన్సారీపార్కు సెంటర్‌, అలాగే సింగ్‌నగర్‌ 61, 62 డివిజన్లలో జరిగిన సుందరయ్య వర్దంతి కార్యక్రమాల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. గవర్నర్‌పేటలోని శ్రీశ్రీ భవన్‌, మధురానగర్‌, దుర్గాపురం, సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, కస్తూర్బాయిపేట, ఆలీభేగ్‌ స్ట్రీట్‌, 30వ డివిజన్‌ దేవినగర్‌, 32వ డివిజన్‌ అయేధ్య నగర్‌, సింగ్‌నగర్‌ 60వ డివిజన్‌ నుంచి 64వ డివిజన్‌ పరిధిలో ఉన్న వాంబేకాలనీ, జంధ్యాల దక్షిణామూర్తి నగరపాలక సంస్థ సెంటర్‌, ప్రకాష్‌ నగర్‌, ప్రకాష్‌గనర్‌ ఎ-1 టీ స్టాల్‌, సుందరయ్యనగర్‌,కండ్రిక తదితర ప్రాంతాల్లో సుందరయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిగురుపాటి బాబూరావు మాట్లాడుతూ…సుందరయ్య స్పూర్తితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్య పరిచి, వారిని పోరాటాల వైపు మళ్లించే విధంగా కృషి చేయడం జరుగుతుందని అన్నారు. దోనేపూడి కాశీనాద్‌, సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శి భూపతి రమణారావు తదితరులు మాట్లాడారు. నియోజకవర్గంలోని ఆయా డివిజన్లలో జరిగిన కార్యక్రమాల్లో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు కె దుర్గారావు, టి ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. విజయవాడ : కృష్ణలంక 21వ డివిజన్‌ బియ్యం కొట్ల బజార్‌లోని సిపిఎం కార్యాలయం, సత్యంహోటల్‌, మణిహోటల్‌, కల్పనా ఫ్రింటర్స్‌ రోడ్డు, రణదివెనగర్‌ ఏరియాలోని రెండు సెంటర్లలో పార్టీ ఆఫీసు సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్రపటానికి ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఐస్‌ ఫ్యాక్టరీ సెంటర్లోలో వై.కృష్ణ , సుందరయ్య నగర్‌ ఆఫీస్‌ సెంటర్‌లో 500 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. కోటిరెడ్డి ఆధ్వర్యంలో వంద మందికి మజ్జిగ పంపిణీ జరిగింది. కెవిపిఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 21వ డివిజన్‌ సిపిఎం ఆఫీసు వద్ద జరిగిన కార్యక్రమానుద్దేశించి ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్‌ మాట్లాడుతూ…సుందరయ్య స్పూర్తితో కమ్యూనిస్టు ఉద్యమ బలోపేతానికి సిపిఎం శ్రేణులు కలిసి కట్టుగా కృషి చేస్తాయన్నారు. 21, 17,18 డివిజన్ల సిపిఎం, సిఐటియు, ఇతర ప్రజాసంఘాల నాయకులు కోరాడ రమణ, కె శివాజీ, తదితరులు పాల్గొన్నారు. విజయవాడ అర్బన్‌ : సిపిఎం మొగల్‌రాజపురం డివిజన్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. మొదల్‌రాజపురంలోని సిపిఎం కార్యాలయం వద్ద పార్టీ సానుభూతిపరుడు, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ పిన్నమనేని కృష్ణారావు సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సిపిఎం నగర కమిటీ సభ్యులు,. తూర్పు సిటీ కమిటీ బాధ్యులు మురహరి పర్యవేక్షణలో కార్యక్రమాన్ని నిర్వహించారు. మొగల్‌రాజపురం బందెలదొడ్డి వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు కుందేటి సత్యనారాయణ సుందరయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మొగల్‌రాజపురం శాఖా కార్యదర్శి శేషు కుమారి తదితరులు పాల్గొన్నారు. నిమ్మతోట సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో సీనియరర్‌ నాయకులు సుందరయ్య వర్థంతి సందర్భంగా పి.శివరామకృష్ణ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు. పార్టీ నగర కమిటీ సభ్యులు రావులూరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు. మోడరన్‌ అకాడమి చైర్మన్‌ సుంక పాపారావు ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. పటమటలోని పలు చోట్ల సుందరయ్య వర్థంతి వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుత పటమట ఈ సేవా కేంద్రం వద్ద 14వ డివిజన్‌ కార్యదర్శి బి.రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో తొలుత సుందరయ్య చిత్రపటానికి ఎన్‌టిఆర్‌ జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యులు పి.కృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. నగర నాయకులు వి.గురుమూర్తి, సిఐటియు నగర అధ్యక్షులు వి.బి. రాజు, బి.బెనర్జీ, వై.ఏడుకొండలు, ఎస్‌.వేణు గోపాలకృష్ణ, కె.నాంచారయ్య, పి.రాజు, మధు, ముని, శివ తదితరులు పాల్గొన్నారు. పటమట తోటవారి వీధిలో సుందరయ్య వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగాసుందరయ్య చిత్ర పటానికి పార్టీ నాయకులు కె. నాంచారయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు. పటమటలంక 9వ డివిజన్‌ శాఖ కార్యాలయం వద్ద సుందరయ్య వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుందరయ్య చిత్ర పటానికి సిపిఎం పార్టీ జిల్లా సభ్యులు పి.కృష్ణ పూలమాల వేసి నివాళులర్పించారు. వన్‌టౌన్‌ : పశ్చిమ నియోజకవర్గం సిపిఎం పశ్చిమ సిటీ ఆధ్వర్యంలో సుందర్య 39వ వర్థంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు డివిజన్లలో సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు.) ఆధ్వర్యంలో 37వ డివిజన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ సెంటర్‌లో కార్మికులు నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో సిపిఎం ఫ్లోర్‌ లీడర్‌, 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు మాట్లాడుతూ ప్రజలందరికీ పని, విద్య, వైద్యం, ఇల్లు కష్టానికి తగిన ఫలితం అందించే పాలన వస్తేనే దేశం, రాష్ట్రం, ప్రజల అభివద్ధి అవుతారని, అందుకు సుందరయ్య చూపిన మార్గమే అనుసరించాలని తెలిపారు . నీతివంతమైన రాజకీయాల కోసం సుందరయ్య మార్గం. దేశ లౌకిక వ్యవస్థ పరిరక్షణకై, రాష్ట్రాల హక్కుల పరిరక్షణ సుందరయ్య ఆశయ సాధనతో ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ అధ్యక్షులు ఉయ్యాలకొండ. లక్ష్మి, సుబ్బారావు, రవణమ్మ తదితరులు పాల్గొన్నారు. 51వ డివిజన్‌ ఆంజనేయవాగు సెంటర్‌లో మట్టి, లిఫ్ట్‌, కటింగ్‌ సిఐటియు ఆధ్వర్యంలో, నెహ్రూ బొమ్మ సెంటర్‌లో సిపిఎం పశ్చిమ సిటీ కార్యదర్శి వర్గ సభ్యుడు కె. సూరిబాబు ఆద్వర్యంలో సుందరయ్య వర్థంతి కార్యక్రమం జరిగింది. వాగు సెంటర్‌లో సిఐటియు నాయకులు ఎ. వెంకటేశ్వరరావు, నెహ్రూ బొమ్మ సెంటర్‌లో సిపిఎం ఎన్‌టిఆర్‌ జిల్లా కార్యదర్శి డి.వి. కృష్ణ పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నోటు పుస్తకాలు, మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లింగయ్య, గొలుసుల రాజు, పాల్గొన్నారు. 50వ డివిజన్‌ అరుణా కాన్వెంట్‌ సెంటర్‌లో అలాగే ఖాదర్‌ సెంటర్‌లో జరిగిన సుందరయ్య వర్థంతి కార్యక్రమంలో 50వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్యబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎం. కొండా రెడ్డి, గాదె సుబ్బారెడ్డి, రాజు, దుర్గారావు పాల్గొన్నారు. వన్‌టౌన్‌ శంకర్‌ కేఫ్‌ సెంటర్‌లో సిఐటియు పశ్చిమ సిటీ అధ్యక్షులు జి. వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎ.వెంకటేశ్వరరావు పాల్గొని సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. 40, 45 డివిజన్‌ సిపిఎం కమిటీల ఆధ్వర్యంలో సితార సెంటర్లో సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ పంపిణీ చేశారు. సిపిఎం పశ్చిమ నగర కమిటీ కార్యదర్శి బి సత్యబాబు. 40వ డివిజన్‌ సెక్రెటరీ ఏ సీను, సీనియర్‌ నాయకులు బి పుల్లారావు, సుదర్శన్‌, తదితరులు పాల్గొన్నారు. 34, 35 డివిజన్‌లలో, మ్యాంగో మార్కెట్లో సిఐటియు ఆధ్వర్యంలో వించిపేట నైజాంగేట్‌ సెంటర్లో, 49వ డివిజన్లో నిర్వహించారు. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో వైసిపి కాలనీలో సుందరయ్య వర్ధంతి జరిగింది. రెడ్డిగూడెం : కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాత, స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి వేడుకలు రెడ్డిగూడెం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్‌ పాములపాటి సత్యనారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. సిపిఎం మండల కార్యదర్శి జంగా వెంకటరెడ్డి సుందరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కామ్రేడ్‌ చాట్ల విజయకుమార్‌ అధ్యక్షతన జరిగిన వర్ధంతి సభలో సిపిఎం సీనియర్‌ నాయకులు మద్ది రెడ్డి మాధవరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కష్ణారెడ్డి, అప్పిరెడ్డి, బాబు, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు గొడవర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చందర్లపాడు : స్థానిక సుందరయ్య భవనంలో సుందరయ్య గారి 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు చనుమోలు సైదులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి అరిగెల చిన్న శ్రీనివాసరావు, వేల్పుల తదితరులు పాల్గొన్నారు. వీరులపాడు : వీరులపాడు దొడ్డదేవరపాడు జుజ్జూరు గ్రామాల్లో సుందరయ్య వర్థంతి నిర్వహించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట కళ్యాణ మాట్లాడుతూ అధ్యక్ష దక్షిణ భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో కామ్రేడ్‌ సుందరయ్య కీలక పాత్ర పోషించాలని వ్యవసాయ కార్మికు కనీస వేతనాల కోసం గ్రామ గ్రామాన పేదల ఐక్యం చేసి కూలి వేతనాలు సాధించడంలో సుందరి సేవలు మరువలేమని అన్నారు. సిపిఎం మండల కార్యదర్శి చాట్ల రవి పొట్టి కొండ పార్థసారథి మల్లికంటి బాబు ప్రసాదు సిపిఎం నాయకులు లాల్‌ అహ్మద్‌ గౌస్‌ సుందరయ్య మంగళపెడు సుందర్రావు, తదితరులు పాల్గొన్నారు. నందిగామ : సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డివిఆర్‌ కాలనీ 18వ వార్డులో ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నందిగామ కార్యదర్శి కె.గోపాల్‌ మాట్లాడారు. సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు సయ్యద్‌ ఖాసిం, బచ్చలకూరి లాజర్‌, షేక్‌ హుస్సేన్‌, సైదా, తదితరులు పాల్గొన్నారు. మైలవరం : నూజివీడురోడ్‌లోని స్థానిక గాంధీ గ్రంథాలయం, మండలంలోని పుల్లూరు, చంద్రగూడెం, గణపవరం, మంగాపురం తదితర గ్రామాల్లో సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రావురి రమేష్‌ బాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్‌ సుధాకర్లు మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య జీవితం ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని, నేటి యువతరానికి ఆయన ఒక స్ఫూర్తిదాయకమన్నారు. శ్రీరాం ముఠావర్కర్‌ యూనియన్‌ మైలవరం అధ్యక్షులు మారేశ్వర రావు, శ్రీనివాస్‌, సిపిఎం నాయకులు పౌలు, ఇసాక్‌, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు జ్యోతి, పూర్ణ, తదితరులు పాల్గొన్నారు. కంచికచర్ల : స్థానిక సిపిఎం కార్యాలయంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోట కళ్యాణ్‌ అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో సుందరయ్య చిత్ర పటానికి సిఐటియు మాజీ నాయకులు షేక్‌ షఫాతుల్లా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి బెజ్జం భూషణం. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షేక్‌ జాహిదా, విమలారావు, కుమారి తదితరులు పాల్గొన్నారు. వత్సవాయి : వత్సవాయిలో రాము అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. సిపిఎం మండల కార్యదర్శి తమ్మినేని రమేష్‌ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. సిపిఎం సీనియర్‌ నాయకులు చిరుమామిళ్ల హనుమంతరావు, మండల కమిటీ సభ్యులు మండే పూడి తదితరులు పాల్గొన్నారు. పెనుగంచిప్రోలు : మండల కేంద్రంలోని సిఐటియు, సిపిఎం మండల కార్యాలయాల వద్ద సుందరయ్య వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కార్యదర్శి దారా నాగేశ్వరరావు, సీనియర్‌ నేత గజ్జి పెద్ద రాజు, బాబు, కొండలు, అంకుల్‌ పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. గంపలగూడెం : స్థానిక సిపిఎం కార్యాలయం వద్ద పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల పార్టీ అధ్యక్షుడు గువ్వల సీతారామిరెడ్డి చిత్రపటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సుందరయ్య చేసిన సేవలను కొనియాడారు. కనుమూరులో చెరుకు వీరారెడ్డి ఆధ్వర్యంలో, ఊటుకూరులో ఎన్‌.జె.చారి ఆధ్వర్యంలో ఈ వర్ధంతి ఆయా కార్యక్రమాల్లో వివిధ గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని నివాళులర్పించారు. ఇబ్రహీంపట్నం : ఆరు పంపులు సెంటర్‌లో సుందరయ్య చిత్రపటానికి శివ, వై.వెంకటేశ్వరరావు వేసి నివాళులర్పించారు. అనంతరం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం కొండపల్లి టౌన్‌ కార్యదర్శి ఎం.మహేష్‌ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కొండపల్లి శాఖ -1 కార్యదర్శి చింతల శివ, నాయకులు బడిషా వెంకటేశ్వరరావు, ఇర్లా కొండలరావు, వెనిగెళ్ళ మురళి మెహన్‌, వై.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.పెనమలూరు : యనమలకుదురులో సిపిఎం కార్యాలయంలో నిర్వహించారు. సిపిఎం నాయకులు కాసిం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మత్స్య కార్మిక సంఘం నాయకులు శ్రీరాములు ఒకటో శాఖ సెక్రెటరీ షేక్‌ బాబు పల్లా చిన్న పాపారావు వసంతరావు తదితరులు పాల్గొన్నారు. ఏ.కొండూరు : మండలం చీమలపాడు గ్రామంలో నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జెట్టి వెంకటేశ్వరావు, గ్రామ కార్యదర్శి పానం ఆనందరావు, అమ్మిరెడ్డి, పి.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.సింగ్‌నగర్‌లో సుందరయ్య 39వ వర్ధంతిప్రజాశక్తి అజిత్‌ సింగ్‌ నగర్‌ : సెంట్రల్‌ సిటీ సింగ్‌ నగర్‌ సిపిఎం ఆధ్వర్యంలో కష్ణ హోటల్‌ సెంటర్‌ వాంబే కాలనీ శాంతినగర్‌ ప్రకాష్‌ నగర్‌ రాజరాజేశ్వరి పేట ఎల్‌ బి ఎస్‌ నగర్‌ లో సుందరయ్య 39వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌.బాబురావు పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుచ్చపల్లి సుందరయ్య కమ్యూనిస్టు నాయకుడు రైతన్న పోరాట వీరుడు స్వతంత్ర సమరయోధుడు అనేక ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అని అన్నారు. పార్లమెంటులో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడుగా పార్లమెంటు సభ్యులుగా గన్నవరం నుండి మూడుసార్లు శాసనసభ్యులుగా పనిచేశారన్నారు. ఆయన చేసిన అనేక ఉద్యమాలను ప్రజలకు మేలు జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కె.శ్రీదేవి, సెంట్రల్‌ సిటీ కార్యదర్శి బి.రమణరావు, అధ్యక్షులు కె.దుర్గారావు, ఎస్‌కె.పేరు, సిహెచ్‌.శ్రీను నాగేశ్వరావు, నజీముద్దీన్‌, సామిరెడ్డి పాల్గొన్నారు.జగ్గయ్యపేట: కమ్యూనిస్ట్‌ ఉద్యమ నిర్మాత, స్వాతంత్య్ర సమరయోధుడు కామ్రేడ్‌ పుచ్చలపల్లి సుందరయ్య వర్థంతి వేడుకలు ఆదివారం మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట, పట్టణంలోని ఎన్టీఆర్‌ సర్కిల్‌, డి వి ఆర్‌ నగర్‌ లోని సుందరయ్య భవనంలో సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ సర్కిల్‌ లో సిపిఎం పార్టీ పట్టణ మండల కార్యదర్శి సోమోజు నాగమణి, సుందరయ్య భవన్‌ లో సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు కోటా కష్ణ, షేర్‌ మహమ్మద్‌ పేటలో సీనియర్‌ నాయకులు కాకానబోయిన లింగారావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పట్టణ, మండల కార్యదర్శి సోమోదు నాగమణి, సిపిఎం పార్టీ సీనియర్‌ నాయకులు కోటా మాట్లాడారు.

➡️