విజయోత్సవాలకు అనుమతులు లేవు

May 25,2024 20:49

ప్రజాశక్తి – కంచికచర్ల : జూన్‌ 4వ తేదీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవని నందిగామ రూరల్‌ సిఐ చంద్రశేఖర్‌ అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా విజయవాడ పౌలీస్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు నందిగామ ఎసిపి రవికిరణ్‌ సారధ్యంలో శనివారం స్థానిక కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో మండల పరిధిలోని రాజకీయ పార్టీల నాయకుల సమావేశం ఎస్‌ఐ సుబ్రమణ్యం అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ అమలులో భాగంగా 144 సెక్షన్‌ పోలీస్‌ 30 యాక్ట్‌ అమల్లో ఉందని అన్నారు. ఎటువంటి సభలు సమావేశాలు, విజయోత్స ర్యాలీలకు అనుమతులు లేవన్నారు. ఫలితాలు వెలువడిన రోజున గెలుపొందిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల తరపున ఎవరైనా ర్యాలీలు నిర్వహించి హద్దు మీరితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.తిరువూరు : 4న ఓట్ల లెక్కింపును దృష్టిలో పెట్టుకొని లా అండ్‌ ఆర్డర్‌ సమస్య తర్వాత ఉందని 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నట్లు ఎస్సై సత్యనారాయణ తెలిపారు. గ్రామాల్లో తిరువూరు పట్టణంలో ప్రజలకు కౌంటింగ్‌ సందర్భంగా గెలుపు ఓటములపై ఎటువంటి అల్లర్లు గానీ, గొడవలు గానీ, పదిమంది కలిసి ఒకచోట చర్చించుకోవడం గానీ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కౌంటింగ్‌ కౌంటింగ్‌ ప్రక్రియను ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి ఇంటి వద్ద వాళ్లే ప్రచారం మాధ్యమాల్లో చూసుకోవాలన్నారు.

➡️