శారదానదిలో మునిగి ఒకరు మృతి..

Mar 21,2024 15:19 #anakapalle district, #Deaths

ప్రజాశక్తి-చోడవరం(అనకాపల్లి) : చోడవరం మండలంలోని గోవాడ గ్రామం వద్ద గల శారదానది వంతెన దిగువన నీటిలో మునిగి ఒకరు మృతి చెందగా, మరోకరు చావు నుంచి బయట పడ్డారు. వివరాల్లోకి వెళితే గురువారం గాజువాక దరి దయాల్ నగర్ కు చెందిన పెంటకోట యుగంధర్ (26),బీశెట్టి రామకృష్ణ లు మాడుగులలో ఫంక్షన్ నిమిత్తం వెళ్లారు. ఈ క్రమంలో వంతెన దిగువన స్నానం చేసేందుకు నీటిలో దిగారు. ఈ క్రమంలో యుగంధర్‌ నీటిలో గల్లంతయ్యాడు. బీశెట్టి రామకృష్ణ యుగంధర్‌ను రక్షించేందుకు నీటిలోకి వెళ్లగా అతను మునిగి పోతూ కేకలు వేయడంతో స్థానికులు చూసి రక్షించి హుటాహుటిన చోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.సంఘటన విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.

➡️