కొనసాగుతున్న సమ్మె

May 23,2024 20:58

 ప్రజాశక్తి – కొత్తవలస : జిందాల్‌ కర్మాగారం వద్ద కార్మికులు చేస్తున్న సమ్మె ఆరవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా గురువారం సిఐటియు జిల్లా కార్యదర్శి కె. సురేష్‌ మాట్లాడుతూ జిందాల్‌ కర్మగారాన్ని యాజమాన్యం బెషరతుగా తెరిపించి కార్మికులందరికీ పని కల్పించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతను చేస్తామని అన్నారు. జిందాల్‌ యాజమాన్యం కార్మికులను రోడ్డుపై నెట్టిందని, ముందస్తు సమాచారం లేకుండా కంపెనీకి లేఆఫ్‌ ప్రకటించడాన్ని తప్పు పట్టారు. కంపెనీ మూసివేసి వారం రోజులు గడుస్తున్నా యాజమాన్యం తీరులో మార్పు లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కుటుంబాలతోనున్న కార్మికులు ఏమి చేయాలో తోచని పరిస్థితిని, దుస్థితిని యాజమాన్యం తీసుకువచ్చిందన్నారు. యాజమాన్యం బేషరతుగా కంపెనీ తెరిచి, కార్మికులందరికీ పని కల్పించాలని డిమాండ్‌ చేశారు. గురువారం కొత్తవలస మేజర్‌ పంచాయతీ సర్పంచ్‌ మచ్చ ఎర్రయ్య రామస్వామి వంట వార్పుకు సహకరించారు. ఈ కార్యక్రమంలో జిందాల్‌ టిఎన్‌టియుసి నాయకులు పిల్ల అప్పలరాజు, సలాది భీమయ్య, సిఐటియు నాయకులు గాడి అప్పారావు, మద్దిల రమణ, వైయస్‌ఆర్‌టియుసి నాయకులు లగుడు వామాలు, పెదిరెడ్ల ప్రసాద్‌, నమ్మి చినబాబు, బొట్ట రాము, బాలిబోయిన ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

➡️