ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పరిశీలన 

Feb 14,2024 15:43 #palnadu district
collector visit house patta process

బొల్లాపల్లి మండలంలో జాయింట్ పర్యటన 

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ ఏ.శ్యాంప్రసాద్ బుధవారం బొల్లాపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించి నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమాలలో భాగంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియలను పరిశీలించారు. బొల్లాపల్లి మండలంలోని రేమిడిచర్ల గ్రామంలో పర్యటించి లబ్ధిదారులతో ముచ్చటించి వివరాలు సేకరించారు. అనంతరం రేమిడిచర్ల గ్రామపంచాయతీ కార్యాలయంలో నవరత్నాల్లో భాగంగా పేదలందరికి ఇళ్ళు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిసితంగా పరిశీలించారు. నెట్వర్క్ సమస్యల వలన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మందగించడం గుర్తించి నెట్వర్క్ సమస్యలను తక్షణమే పరిష్కరించవలసిందిగా సంబంధిత ఎంపీడీవో, ఎమ్మార్వో మరియు ఈవోపీఆర్డీలను ఆదేశించారు. ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉన్నచోట వెంటనే అవసరమైన చర్యలు చేపట్టి రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి బి.వి రమణరావు, ఎంపీడీవో విజయ్ కుమార్, ఈవోపీఆర్డి జిలాని భాష, డిప్యూటీ తహశీల్దార్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

➡️