పారా అథ్లెటిక్స్‌ పోటీల పోస్టర్‌ ఆవిష్కరణ

Jun 19,2024 23:30 #Para Atheleticks poster
Para Athelitics poster

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్‌ : విశాఖపట్నం వేదికగా పోలీస్‌ బేరక్స్‌ గ్రౌండ్‌లో ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్న 5వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌, జూనియర్‌ పారా అథ్లెటిక్స్‌ పోటీల పోస్టర్‌ను జిల్లా దివ్యాంగుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ జె.మాధవి బుధవారం ఆవిష్కరించారు. పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యాన స్పోర్ట్స్‌ అథారిటీ సహకారంతో రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్‌ నిర్వహించనున్నట్లు మాధవి తెలిపారు. ఈ పోటీలకు అన్ని జిల్లాల నుంచి వికలాంగ క్రీడాకారులు పాల్గొని ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపిక అవ్వాలని ఆకాంక్షించారు. ఆసక్తిగల వికలాంగ క్రీడాకారులు 7013569514, 9390131777 నంబర్లను సంప్రదించి పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆంధ్రప్రదేశ్‌ కో-ఆర్డినేటర్‌ వై.శ్రీనివాస్‌గౌడ్‌ సూచించారు. ఈ కార్యక్రమంలో వి.రామస్వామి, బి.గణేశ్‌, ఎమ్‌.నరసింహరాజు, హుస్సేన్‌, ఆవల రమేష్‌ బాబు, ప్రసాద్‌ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️