నిందితుడికి కొమ్ముకాస్తున్నపోలీసులు

ప్రజాశక్తి-మదనపల్లి పట్టణంలో చీటీలు వేసి నష్టపోయిన బాధితులకు న్యాయం చేయలేని పోలీసులు నిందితుడికి అండగా నిలుస్తున్నారని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్‌ అన్నారు. శుక్రవారం కృష్ణానగర్‌లోని చీటీల నిర్వాహకులు ఎయిర్‌టెల్‌ సుధాకర్‌రెడ్డి అన్న ఎపిపి జయణరాయణరెడ్డి గహంలో చీటీలు వేసి నష్టపోయిన బాధితులు తమకు డబ్బులు చెల్లిస్తున్నారని అక్కడికి వెళ్లారు. అక్కడ బాధితులకు, జయణరాయణరెడ్డికి వాగ్వాదం జరిగింది. కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకున్నామని, ఆ సొమ్మును వారి పిల్లల చదువు కోసం, పెళ్లిళ్ల కోసం, భవిష్యత్తు కోసం కూడబెట్టు కొన్న సొమ్మును విఎస్‌ఆర్‌ గ్రాండ్‌ సుధాకర్‌రెడ్డి వద్ద చీటిల రూపంలో నెల నెల కట్టామన్నారు. జయనారాయణరెడ్డి ఇంట్లోకి బాధితులకు రహస్యంగా 40 శాతం అమౌంట్‌ ఇస్తా మని కొంతమందిని బాధితులను పిలిపిం చుకు న్నారు. ప్రభాకర్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.10 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రూ.5 లక్షల చెక్కు రూపంలో ఇచ్చారు. మరో వ్యక్తికి ఐదు లక్షలకు గాను రూ.1.50 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపు కున్నారు. డబ్బులు ఇస్తున్న సమాచారాన్ని తెలుసు కున్న మరి కొంతమంది బాధితులు బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్‌తో కలసి జయనా రాయణరెడ్డి ఇంటిని ముక్కుముడిగా ముట్టడిం చారు. అక్కబేన్న సుధాకర్‌ రెడ్డి బయట రాకుండా దాక్కున్నాడు. ఎందుకు సగం డబ్బులు మాత్రమే పంచుతున్నారని జయనారాయణ రెడ్డిని ప్రశ్నిం చారు. లేదు నేను పంచలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పంచుతున్నట్లు పక్కా ఆధారాలు చూపిస్తామని పునీత్‌ అనడంతో చేసేదేమీ లేక జయనారాయణరెడ్డి సైలెంట్‌ అయి పోయాడు. మా డబ్బులు కచ్చితంగా ఇవ్వాలని బాధితులు పట్టుపట్టారు.. ఇంట్లోనే దాదాపు గంటసేపు పైగా బాధితులకు జయ నారా యణరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. డబ్బులు ఇచ్చేదే లేదని నారాయణరెడ్డి బాధితులకు తేల్చి చెప్పాడు. నారాయణరెడ్డి బాధితుల మధ్య వాగ్వాదం జరుగుతుండగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇంట్లోకి ఎందుకు వచ్చారంటూ వన్‌ టౌన్‌ సిఐ వలీ బాష బాధితులను ప్రశ్నించారు. దొంగగా కొంతమందికి మాత్రమే డబ్బులు ఎలా ఇస్తారంటూ పోలీసులను నిలదీశారు. డబ్బులు ఇచ్చేంతవరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని బాధితులు పోలీసులకు తేల్చి చెప్పారు. బాధితుల వైపు న్యాయం కోసం పోరాటం చేస్తున్న పునీత్‌ నుఅరెస్ట్‌ చేసి సిఐ వల్లి బాష సిబ్బందికి ఆదేశాలు ఇచ్చాడు. ఆగ్రహించిన బాధితులు పునీత్‌ను అరెస్టు చేస్తే పోలీసులను అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. చేసేదేమీ లేక పోలీసులు నెమ్మదిగా వాహనాలు ఎక్కి వెళ్ళిపోయారు. సులు

➡️