మచిలీపట్నం పురవీధుల్లో కేంద్ర సాయుధ బలగాలతో పోలీస్ కవాతు

Mar 21,2024 17:14 #Krishna district

ప్రజాశక్తి – కృష్ణా : జరగబోయే సార్వత్రిక ఎన్నికలు-2024 కృష్ణా జిల్లాలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందికి అదనంగా కేంద్ర సాయిధబలగాలు జిల్లాకు చేరాయి. అందులో భాగంగా బందర్ సబ్ డివిజన్ కు కేటాయించబడిన CRPF 27 బెటాలియన్ కు చెందిన కేంద్ర సాయుధ బలగాలతో బందరు పట్టణ పోలీసు అధికారులందరూ, సిబ్బందితో కలిసి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు బందరు డిఎస్పి మహమ్మద్ అబ్దుల్ సుభాన్ ఆధ్వర్యంలో మచిలీపట్నం స్థానిక హైని హై స్కూల్ నుండి లక్ష్మీ టాకీస్ సెంటర్, జిల్లా కోర్టు సెంటర్, బస్టాండ్, కోనేరు సెంటర్, కోట తుళ్ళ వారి సెంటర్, బుట్టాయిపేట, రామానాయుడుపేట, పరాశపేట చిలకలపూడి మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ వరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

ఇప్పటికే ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ప్రజలందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పకుండా పాటించడంతో పాటు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఓటు హక్కును ప్రజలందరూ స్వేచ్ఛగా వినియోగించుకొని ప్రశాంత ఎన్నికలకు దోహదపడాలని, ఎన్నికలలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని సమస్యాత్మక గ్రామాలు,  పట్టణాలలో, కాలనీలలో ఎన్నికల వేళ ఎలాంటి గొడవలు, అల్లర్లు, హింసకు దూరంగా ఉండాలని కవాతు, నిర్వహిస్తూ కేంద్ర బలగాలు ప్రజలను చైతన్య పరుస్తున్నారు

అలాగే ప్రజలు ఎవరు కేసులలో చిక్కుకోవద్దని ఒక్కసారి కేసులలో చిక్కుకుంటే జీవితాంతం ఆ కేసు తాలూకు ఇబ్బంది ఎదుర్కోవాల్సిందేనని కనుక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు ముగిసేలా పోలీస్ వారికి సహకరించాలని ఫ్లాగ్ మార్చ్ ద్వారా అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం సబ్ డివిజన్ డిఎస్పి మహమ్మద్ అబ్దుల్ సుభాన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జేవి రమణ, సిఆర్పిఎఫ్ బెటాలియన్ కమాండెంట్, పట్టణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️