పేద ముస్లింలు సామూహిక వివాహాలను సద్వినియోగం చేసుకోవాలి

Jun 20,2024 16:45 #Kurnool, #Muslim Marriages

ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక వివాహాలు

ప్రజాశక్తి – కర్నూలు  కార్పొరేషన్ : పేద ముస్లింలు సామూహిక వివాహాలను సద్వినియోగం చేసుకోవాలని స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ. డి .సబిహ పర్వీన్ కోరారు. గురువారం కర్నూలు నగరంలోని స్థానిక జిబి ఫంక్షన్ హాల్ నందు, ఘనంగా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించినట్లు అవాజ్ కమిటీ అధ్యక్ష ,కార్యదర్శులు పి .ఇక్బాల్ హుస్సేన్, ఎస్ .ఎం. డి .షరీఫ్, మదీనా కాలేజ్ కరస్పాండెంట్, ఎం. మహమూద్ పాషాలు తెలియ జేశారు. పేద ముస్లిం యువతి యువకులకు ఆవాజ్ కమిటీ గత 16 సంవత్సరాలుగా.. సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలియజేశారు. ఈ సామూహిక వివాహాలపై స్టేట్ మైనారిటీఫైనాన్స్ కార్పొరేషన్ ఈ డి సబిహా పర్వీన్  మాట్లాడుతూ.. గతంలో అల్ హజ్ అబ్దుల్ గఫూర్ అండ్ ఖమ్రుణ్ణిస బేగం, పూర్ గర్ల్స్ మ్యారేజ్ అసోసియేషన్ వారి తరఫున నిర్వహించే వారిని, వారు ఈ మధ్యకాలంలో చనిపోవడంతో, ఈ పెళ్లిళ్లు ఆపకూడదనే ఉద్దేశంతో, ఆవాజ్ కమిటీ నగర అధ్యక్షులు, పి ఇక్బాల్ హుస్సేన్, మదీనా కాలేజ్ కరస్పాండెంట్, మహమూద్ పాషా వారి ఆర్థిక సహాయంతో, ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ వివాహాలు నిర్వహించినట్లు, తెలియజేశారు. రాబోవు కాలంలో ఇంకా పెద్ద సంఖ్యలో వివాహాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని పేద ముస్లిం లు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అలాగే ఈ వివాహాలకు దాతలు కూడా ముందుకు వచ్చి ఆవాజ్ కమిటీ వారికి సహాయ సహకారాలు అందించాలని, ప్రభుత్వం తరపు కూడా  సహకారం ఉండాలని వారు నూతన ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా వధూవరులకు బీరువా,పట్టే మంచం, జెహెజ్ (వంట సామాగ్రి) తో పాటు అమ్మాయికి పట్టీలు, ఉంగరం, అబ్బాయికి చేతి గడియారం అందించారు. ఈ వివాహాల కార్యక్రమంలో ఆవాజ్ కమిటీ నగర ఉపాధ్యక్షులు, సయ్యద్ హుస్సేన్ అహ్మద్, చోటు భాయ్, అబ్దుల్ దేశాయ్, అబ్దుల్ నయీమ్, షేక్షావలి, మహబూబ్ బాషా, హిందీ కాలేజ్ ప్రిన్సిపాల్, నిసార్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
ఈ వివాహాలను నాయబ్ సయ్యద్ సలీంపాషా నిర్వహించారు . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆవాజ్ కమిటీ తరఫున అభినందనలు తెలియజేశారు.

➡️