మత్తుపదార్థాలు స్వాధీనం

సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఇబి అధికారులు

మంగళగిరి :  తాడేపల్లి బైపాస్‌ రోడ్‌ లో 5 లక్షల 50 వేల రూపాయలు విలువైన 88 గ్రాముల మెత్‌ అనే మత్తు పదార్థాలను ఎస్సిబి అధికారులు పక్కా సమాచారంతో ఎస్‌ ఈ బి అధికారులు దాడి చేసి శనివారం పట్టు కున్నట్లుగా ఎస్‌ఇబి అడిషనల్‌ జిల్లా కమిషనర్‌ ఎం.వెంక టేశ్వరరావు మంగళగిరి ఎస్‌ఇబి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బెంగళూరులో కొనుగోలు చేసిన మత్తు పదార్థాలను గుంటూరు, విజయవాడ మధ్య గల బైపాస్‌ రోడ్‌లో విక్రయిస్తున్న ముగురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్‌ ఈ బి సి ఐ లక్ష్మీ ప్రసన్న, ఎస్సై రాజేంద్ర, సిబ్బంది పద్మజ, శ్రీను, నాగరాజు, నరసింహారావు పాల్గొన్నారు.

➡️