నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

Dec 19,2023 22:07
ఫొటో : మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌ కుమార్‌

ఫొటో : మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌ కుమార్‌
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ప్రజాశక్తి-ఉదయగిరి : ఓటర్ల నమోదులో నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రాజా రమేష్‌ ప్రేమ్‌ కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఓటర్ల నమోదు తొలగింపులు చేర్పులు మార్పులపై నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను ఆదేశించారు. ఫారం-7పై అభ్యంతరాలు ఉంటే బిఎల్‌ఒ, విఆర్‌ఒ, తహశీల్దార్‌ దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ఫారం-7 ఏవైనా అవకతవకలకు పాల్పడితే ఎలక్షన్‌ కమిషనర్‌ మార్గదర్శకాలతో కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామాల్లో ఓట్ల నమోదు తొలగింపులు మార్పులు చేర్పులకు అన్ని రాజకీయ పార్టీలు నాయకులు సహకరించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇటీవల గండిపాలెం బూత్‌ నెంబర్‌ 31, 32 వచ్చిన ఫిర్యాదులపై గ్రామసభ నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తున్నామని గ్రామంలో ఓటు పొందే ప్రతిఒక్కరూ స్థానికంగా ఉండి సంబంధిత ధ్రువపత్రాలు బిఎల్‌ఒలకు సమర్పించి సిబ్బందికి సహకరించి నిర్థారణ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ సానా శ్రీనివాసులురెడ్డి, ఎలక్షన్‌ డిటి శ్యామ్‌, అన్ని రాజకీయ పార్టీ నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.

➡️