దుప్పట్లు పంపిణీ

Jun 23,2024 21:27
ఫొటో : దుప్పట్లు పంపిణీ చేసిన ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆగేష్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సభ్యులు

ఫొటో : దుప్పట్లు పంపిణీ చేసిన ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆగేష్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సభ్యులు
దుప్పట్లు పంపిణీ
ప్రజాశక్తి-అనంతసాగరం : మండలంలోని పాతాళ్లపల్లి గ్రామంలో ఆదివారం ఆగేష్‌ మల్టీ పర్పస్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఫ్రెండ్స్‌ ఆఫ్‌ ఆగేష్‌ చారిటబుల్‌ ఫౌండేషన్‌ సహకారంతో తల్లి తండ్రి లేని 20మంది నిరుపేద విద్యార్థులకు, మరో 20 మంది వృద్ధులకు దుప్పట్లు, చీరలను అధ్యక్షులు, జిల్లా హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ ఆఫెన్స్‌ కంట్రోల్‌ కమిటీ అధ్యక్షులు కానగల వెంకట రమణయ్య పంపిణీ చేశారు. అలెగ్జాండ్రా ఫెర్బర్స్‌ పుట్టినరోజును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా గత పది సంవత్సరాలుగా అనంతసాగరం, కలువాయి మండలాలలో అనాథలైన నిరుపేద విద్యార్థులకు ఆర్థికసాయం చేస్తూ వారి చదువులకు సహాయం చేస్తున్నామన్నారు. తమ సంస్థలో వారినందరిని చేర్చి పైచదువులకు వెళుతున్న విద్యార్థును అభినందించి వారికి చదువులపై అవగాహన కల్పించామన్నారు. కష్టపడి బాగా చదువుకోవాలని బాగా చదువుతున్న విద్యార్థులకు మా సంస్థ అన్నివిధాలా సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. కార్యక్రమంలో పాతాళ్లపల్లి గ్రామ టిడిపి సీనియర్‌ నాయకులు చల్లా వెంకటరమణారెడ్డి, సంస్థ కోశాధికారి కానగల పెంచలమ్మ, గ్రామప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

➡️