‘ఎస్‌బిఐ’ రక్తదాన శిబిరం

Jun 23,2024 21:25
ఫొటో : రక్తదానం చేస్తున్న ఎస్‌బిఐ ఉద్యోగులు

ఫొటో : రక్తదానం చేస్తున్న ఎస్‌బిఐ ఉద్యోగులు
‘ఎస్‌బిఐ’ రక్తదాన శిబిరం
ప్రజాశక్తి-కావలి : కావలి ఎస్‌బిఐ ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహించడంతో పాటు, సేవా కార్యక్రమాలలో ముందుంటారని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ మేనేజర్‌ ఎన్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆదివారం దివంగత ఎస్‌బిఐ స్టాఫ్‌ యూనియన్‌ నాయకులు తారకానాథ్‌ వర్థంతి సందర్భంగా ఆర్‌డిఒ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్‌బిఐ ట్రంక్‌ రోడ్డు బ్రాంచ్‌లో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో సిబ్బందితోపాటు వినియోగదారులు 104మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రీజినల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ రక్తదాతలను అభినందించారు. ఈ శిబిరాన్ని ట్రంక్‌ రోడ్డు బ్రాంచ్‌ మేనేజర్‌ గొర్ల శివకుమార్‌ ప్రారంభించగా, స్టాఫ్‌ యూనియన్‌ అమరావతి సర్కిల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వివి ప్రసాద్‌, రీజియన్‌ కార్యదర్శి సనత్‌ కుమార్‌, మెయిన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి కె.శ్రీనివాసులు రెడ్డి, ట్రంక్‌ రోడ్డు బ్రాంచ్‌ కార్యదర్శి కె.భువనేశ్వరి, టౌన్‌ బ్రాంచ్‌ కార్యదర్శి జ్యోస్న, టౌన్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ నరేంద్ర, ఇతర బ్యాంక్‌ అధికారులు మహేష్‌, శేఖర్‌బాబు, స్టాఫ్‌ యూనియన్‌ సభ్యులు సుమన, కళ్యాణి, శ్రీనివాసులు, టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్‌ నాగమణి, డాక్టర్‌ రమ్యలను ఘనంగా సత్కరించారు. రెడ్‌క్రాస్‌ రక్తకేంద్రం కన్వీనర్‌ డాక్టర్‌ బెజవాడ రవికుమార్‌ రక్తదాతలకు ప్రశంసాపత్రాలను బహూకరించారు. రెడ్‌క్రాస్‌ బాధ్యులు కె.హరినారపరెడ్డి, రక్తకేంద్రం సిబ్బంది శిబిరాన్ని నిర్వహించారు.

➡️