లారీని ఢీకొన్న బస్సు – ఒకరు మృతి

Jan 7,2024 11:09 #Nellore District, #road accident
road accident in nellore

ప్రజాశక్తి-నెల్లూరు జిల్లా : నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారు జామున టిఎస్ఆర్టీసి బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు..ఏడుమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమమంగా ఉంది. మృతి చెందిన వ్వక్తి బస్ డ్రైవర్ వినోద్ గా గుర్తించారు.హైదరాబాద్ నుండి నుంచి తిరుపతి వెళ్తున్న టిఎస్ఆర్టీసి బస్సు ముందు భాగం నుజునుజ్జు అయింది.
తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో హైదరాబాదు నుండి తిరుపతి వెళుతున్న మిర్యాలగూడ డిపోకు చెందిన టీఎస్ 05 249 నెంబర్ గల సూపర్ లగ్జరీ సర్వీస్ బస్సు మోచర్ల గ్రామ సమీపంలో ముందుగా వెళుతున్న ధాన్యం లోడుతో లారీ నెంబర్ ఏపీ 03 TD 21 33 వెనక నుండి ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వినోదు చనిపోవడం జరిగినది. ప్రయాణికులకు ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా నెల్లూరు అపోలో హాస్పిటల్ కు తరలించడం అయినది. చనిపోయిన డ్రైవరు మృతదేహాన్ని కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు..

➡️