ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి బాలుడు మృతి

Jun 3,2024 12:34 #Prakasam District

ప్రజాశక్తి-కురిచేడు : ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర కాశీపురం గ్రామానికి చెందిన సాధం కొండలు అంజమ్మలకు ప్రథమ సంతానమైన సాధం బంగారు (13)  ఆదివారం తమ గేదలను తోలుకొని మేతకు వెళ్ళాడు. మధ్యాహ్నవేళ గేదలకు నీళ్లు త్రాపుటకు చెరువులోకి తీసుకెళ్లగా ఇటీవల కురిసిన వర్షానికి చెరుకు నీళ్లు ఎక్కువ రావడంతో ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మృతి చెందాడు. మృతుడు సాదం బంగారుకు  ఈత రానందున నీళ్లలో ఈదలేక గట్టు చేరలేక నానా ఇబ్బందులు పడి తుదకు మృత్యువాతకు గురయ్యాడు. ఈ సంగతి తెలిసిన గ్రామస్తులు చెరువులోకి వెళ్లి మృతుడు సాధం బంగారు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుని తల్లి అంజమ్మ రోదిస్తున్నడంతో ఆ సంఘటన చూసిన స్థానికుల హృదయం చలించినది. ఇదిలా ఉండగా మొన్నటి వరకు చెరువుకు నీరు లేదని చెరువుకు మునుపెన్నడు ఇన్ని నీళ్లు రాలేదని తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువుకు నీళ్లు వచ్చాయని పలువురు స్థానికులు తెలిపారు. ఈ విషయం తెలిసిన సర్పంచి ప్రతినిధి సాధం నాసరయ్య వైఎస్ఆర్సిపి కురిచేడు మండలం ఎస్సీ సెల్ అధ్యక్షులు ముక్తిపూడి కిరణ్ బాబు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

➡️