చీమకుర్తిలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవం

May 30,2024 16:03 #Prakasam District

ప్రజాశక్తి-చీమకుర్తి : సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చీమకుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో పి కృష్ణయ్య భవనం వద్ద జెండా ఆవిష్కరణ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో కార్మిక వర్గ సమస్యలపై నిరంతరం సిఐటియు పోరాటాల నిర్వహిస్తోందని కార్మిక వర్గాన్ని ఐక్యం చేసేపని చేస్తా ఉందని,దేశంలో నూతన ఆర్థిక విధానాలపై, కార్మిక వర్గానికి నష్టం చేసేటువంటి విధానాలు పైన, రైతాంగ సమస్యల పైన నిరంతరం పోరాటాలు చేస్తా ఉందని, సరళీకరణ, ప్రపంచీకరణ విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తా ఉందనిఅన్నారు.పాలకుల అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్త సమ్మే లు నిర్వహించి రాబోయే రోజుల్లో ఈ విధానాలపై పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మాట్లాడినారు ముఠావర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు బి వీరాంజనేయులు, పి ఆంజనేయులు సిఐటియు నాయకులు పి వెంకటరావు,బి ఓబులేషు,జి అప్పలనాయుడు, బిందె ఆంజనేయులు,డి సురేష్ జి శంకర్, కనకరాజు వివిధ రంగాల కార్మికులు పాల్గొన్నారు.

➡️