జాన్ డీర్ ఎసి క్యాబిన్ ట్రాక్టర్ ఆవిష్కరణ

Apr 11,2024 23:33 ##Jhondeer #TractorAC

ప్రజాశక్తి – మార్కాపురం
పట్టణంలోని కాలేజీ రొడ్డులోని మార్కెట్ యార్డు సమీపంలోని జాన్ డీర్ ట్రాక్టర్ షో రూంలో ఎసి క్యాబిన్‌తో ఉన్న కొత్త మోడల్ ట్రాక్టర్‌ను కంపెనీ ఏరియా మేనేజర్ శంకర్, సత్యసాయి ఆటోమోటివ్స్ డీలర్ సతీష్ గురువారం ఆవిష్కరించారు. ఏసీ క్యాబిన్‌, అత్యాధునిక టెక్నాలజీ ఉన్నందున కొనుగోలు చేసినట్లు కొనకలమిట్ల మండలం కాట్రగుంట గ్రామానికి చెందిన రైతు టి శంకర్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జాన్ డిర్ కంపెనీ ఏరియా మేనేజర్ శంకర్ మాట్లాడుతూ అత్యంత అధునాతన టెక్నాలజీతో 75హెచ్‌పి ట్రాక్టర్‌ను కంపెనీ తయారు చేసిందని తెలిపారు. ఈ ట్రాక్టర్‌కు జిపిఎస్ సిస్టం అమర్చబడి ఉందని తెలిపారు. ప్రపంచంలో ఎక్కడ నుండైనా ట్రాక్టర్ ఎక్కడ పనులు చేస్తుందో చూసుకునే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ పోతురాజు, షో రూమ్ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

➡️