వైసిపి పాలనలో మైనారిటీలకు న్యాయం

May 3,2024 00:41 ##ycpnews #markapuram

ప్రజాశక్తి – మార్కాపురం
పట్టణంలోని అయేషా మసీద్ ఏరియాలోని ముస్లిం కుటుంబలను కలిసి వైసిపి పధకాలు వివరించారు. ఒంగోలు ఎంపిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మార్కాపురం ఎంఎల్‌ఎగా అన్నా రాంబాబును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మొఘల్ షంషీర్ అలీ బేగ్, డాక్టర్ మక్బుల్ బాష, వైసిపి పట్టణ అధ్యక్షులు, వైస్ చైర్మన్ షేక్ ఇస్మాయిల్, నజీర్, కౌన్సిలర్స్ నాసర్, కరీం బాషా, కో- ఆప్షన్ మెంబర్ అమీరుల్ ఖాన్, మౌలాలి, మొహమ్మద్, కరీముల్లా, సిఎం ఖాసిం, చంద్ భాష, ఆసిఫ్ ఖాన్ పాల్గొన్నారు.

మార్కాపురం : తర్లుపాడు మండలంలోని తుమ్మలచెరువు గ్రామంలో వైసిపి అభ్యర్థి అన్నా వెంకట రాంబాబు తనయుడు అన్న కృష్ణ చైతన్య ఎన్నికల ప్రచారం గురువారం నిర్వహించారు. గ్రామ ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. గడపగడప తిరుగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఒంగోలు ఎంపిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎంఎల్‌ఎగా తన తండ్రి అన్నా వెంకట రాంబాబును గెలిపించాలని కోరారు.

➡️