‘రఘురాముడు’ రాజకీయాలకు పనికిరాడు

ప్రజాశక్తి – ఖాజీపేట ప్రస్తుత మైదుకూరు ఎమ్మెల్యే రఘురాముడు (ఎస్‌.రఘు రామిరెడ్డి) రాజకీయాలకు పనికి రాడని, ఆయన ఒక పెద్ద అవినీతి పరుడని మాజీ మంత్రి డి.ఎల్‌. రవీం ద్రారెడ్డి విమర్శించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోవు ఎన్నికల్లో మైదుకూరు నియోజకవర్గం టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సుధాకర్‌యాదవ్‌ అహంభావాన్ని వీడి కుల, మతాలకు అతీతంగా పనిచేస్తే నియోజకర్గం ప్రజలకు శాశ్వతంగా ఎమ్మెల్యేగా గెలిపిస్తారని చెప్పారు. ఆయన ఎలాంటి అవినీతికి పాల్ప డకుండా తన సొంత వ్యాపారాలు చేసుకుంటూ సేవ చేసేందుకు రాజకీయం సాగిస్తు న్నారన్నారు. వివేకా కుమార్తె సునీత తనను కళిశారని, ఎంపీ అవినాష్‌ గురించి విషయం ప్రస్తావనకు తీసుక రాగా ‘వివేకం’ సినిమా చూసి ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పడం జరిగిం దన్నారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకిని కాదని, పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన ర్హులకు టికెట్లు కేటాయించడం, టికెట్లు అమ్ముకోవడం వంటి అంశాలు కాకుండా సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చెయ లేడని పేర్కొన్నారు. గతం లో రుణమాఫీ కూడా చేయలేదన్న అపవాలుదున్నాయని వాపో యారు. చంద్రబాబు ఎంతో మేధావి అని బిజెపి, జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారనో తెలియదని తెలిపారు. పొత్తు వల్ల మైనారిటీ ఓట్లు నష్టం చేకూరుస్తాయన్నారు. జనసేన వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదు పేర్కొన్నారు. స్థానిక పరిస్థితుల దష్ట్యా పుట్టా సుధాకర్‌ యాదవ్‌కే మద్దతన్నారు. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఉరూరు తిరిగి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరిస్తే ప్రజలు ఎప్పుడు ఆదరి స్తారని, డైరీని పాటించాలని సూచించారు. ఆయా పార్టీలలో లకలుకలు ఉన్నా, రాష్ట్రంలో కూటమి యే అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. తాను క్రియాశీలకంగా రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలిగానని, గ్రామాలకు వెళ్లి ప్రచారం చేయడం సాధ్యం కాదని చెప్పారు.

➡️