ఇంటిపై పడిన వేప చెట్టు – ధ్వంసం అయిన రేకులు

Dec 6,2023 17:26 #ntr district
rains impact in 50th division

ప్రజాశక్తి-విజయవాడ : ఈరోజు ఉదయం 50 డివిజన్ గొల్లపాలెం గట్టు వాటర్ ట్యాంకు వద్ద వేపచెట్టు క్రింది భాగంలో ఉన్న వేంపాడ గురమ్మ(6-14/1-16) రేకుల ఇంటిపై పడి ఇల్లు రేకులు ధ్వంసం అయినవి. సంఘటన విషయం తెలిసిన వెంటనే ఘటన ప్రాంతానికి కార్పొరేటర్ బి సత్యబాబు వెళ్లి పరిశీలించి బాధితులను పరామర్శించి నగరపాల సంస్థ అధికారులకు కమిషనర్ కి, పశ్చిమ తాసిల్దార్ పీ జాహ్నవికి ఫిర్యాదు చేయడం జరిగింది. చేసిన ఫిర్యాదు మేరకు తాసిల్దార్ పి.జాహ్నవి ఘటన స్థలాన్ని పరిశీలించి ప్రభుత్వపరంగా సహాయాన్ని త్వరగా అందించే నష్టపరిహారం ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి త్వరగా వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ గత రెండు రోజులుగా తుఫాన్ భారీ వర్షాలకు కొండప్రాంతంలో బలహీనంగా ఉన్న ఇంటి గోడలు రిటైనింగ్ వాల్సు, చెట్లు ప్రమాదాలకు నిలయంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వెంపాడ గురమ్మ రేకులిల్లు గత నాలుగు మాసాల క్రితం నిర్మించుకొని నివాస ఉంటున్నారు. ఈ సంఘటనలో నష్టపోయిన గురమ్మ కుటుంబానికి పక్కా ఇల్లు మంజూరు చేసి తగిన ఆర్థిక నష్టపరిహారం వెంటనే అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన స్థలాన్ని సందర్శించిన వారిలో సిపిఎం నగర్ కమిటీ సభ్యులు పి రాజు, డివిజన్ నాయకులు సిహెచ్ దుర్గారావు, పి మహేష్, సిఐటియు నాయకులు బి దుర్గారావు, నారాయణ, లక్ష్మణ, తదితరులు పాల్గొన్నారు.
49 డివిజన్ టైలర్ పేట కళ్యాణ్ మండపం వీధిలో కడితే వెంకయ్యమ్మ వారి రేకులు సంబంధించిన ఇంటికి గోడలు ఈ రెండు రోజుల వర్షాలకు నాని కూలిపోయినవి. గత ఆరు మాసాల క్రితం వచ్చిన భారీ వర్షాలు కూడా వారి ఇంటికి గోడలు వెనుక భాగం కూలిన రెవెన్యూ అధికారులు ప్రభుత్వం ఎటువంటి నష్టపరిహారం నేటికి చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పశ్చిమ నగర తాసిల్దార్ పి.జాహ్నవి గారికి ఫిర్యాదు చేయడం జరిగింది పేదలైన వారికి పక్కా ఇల్లు నిర్మాణం చేసి వెంటనే నష్టపరిహారం అందించాలని ఈ సందర్భంగా సిపిఎం పశ్చిమ నగర్ కమిటీ కార్యదర్శి బి సత్యబాబు సిపిఎం ఫ్లోర్ లీడర్ డిమాండ్ చేశారు. ఈ పర్యటనలు సిపిఎం నాయకులు పి రాజు సిహెచ్ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

rains impact in 50th division a

➡️