కూటములు కుట్రలు చేసినా గెలిచేది రాంబాబే

Apr 22,2024 00:37

ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : కూటములు ఎన్ని కుట్రలు చేసినా సత్తెనప ల్లిలో గెలిచేది అంబటి రాంబాబేనని వైసిపి నర్సరావుపేట ఎంపి అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. స్థానిక వైసిపి కార్యాల యంలో రాంబాబుతో కలిసి ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలోని వైసిపి నాయకులంతా ఏకమై అంబటి రాంబాబు విజయానికి కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ నియోజకవర్గాన్ని వైసిపికి కంచుకోటగా నిర్మించాలన్నారు. రాంబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో అసంతృప్తులు గుసగుసలకు తెరదించుతూ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు ఎవరైనా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. ఈ నెల 24న అనిల్‌ కుమార్‌ యాదవ్‌, 25న తాను నామినేషన్లు వేస్తామని, శ్రేణులు భారీగా తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి, గుబ్బా చంద్రశేఖర్‌, డాక్టర్‌ గజ్జల నాగభూషణరెడ్డి, చిట్టా విజయభాస్కరరెడ్డి, ఎన్‌.రాజానారాయణ పాల్గొన్నారు.ప్రజాశక్తి – నకరికల్లుఅర్హతున్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలంటే వైసిపిని గెలిపించాలని ఆ పార్టీ సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబు అన్నారు. మండలంలోని దేచవరంలో ఆదివారం భవనం రాఘవరెడ్డి సమక్షంలో సుమారు 25 కుటుంబాలు టిడిపిని వీడి వైసిపిలో చేరాయి. వీరికి పార్టీ జెండాలను రాంబాబు కప్పి ఆహ్వానించారు. అనంతరం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. నాయకులు ఎం.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, హుస్సేన్‌బి, బాషా, డి.కోటిరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.ప్రజాశక్తి – సత్తెనపల్లి రూరల్‌మండలంలోని భృగుబండ గ్రామంలో ఆదివారం నిర్వహించిన శ్రీ సుభద్ర బలరామ సమేత జగన్నాద స్వామి ఆలయ పున్ణ ప్రతిష్టలో సత్తెనపల్లి వైసిపి అభ్యర్థి అంబటి రాంబాబు, నరసరావుపేట ఎంపీ అఅభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. వీరిని కమిటీ నిర్వాహకులు సత్కరించారు.

➡️