ఓటు ప్రాముఖ్యతను గ్రహించాలి

Apr 6,2024 21:48

ప్రజాశక్తి-విజయనగరం కోట : ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనదని జాయింట్‌ కలెక్టర్‌ కె.కార్తీక్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు ప్రాముఖ్యతను తెలుసుకొని, వచ్చే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించు కోవాలని కోరారు. స్వీప్‌ కార్యక్రమ ంలో భాగంగా విజయనగరం పట్టణంలో డ్వాక్రా మహిళలతో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక గాంధీ విగ్రహం నుంచి కన్యకాపరమేశ్వరి ఆలయం, గంటస్థంభం మీదుగా రాజీవ్‌ క్రీడా మైదానం వరకు ఈ ర్యాలీ జరిగింది. అనంతరం ఓటు అన్న అక్షరాలతో మానవ హారాన్ని నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన అనంతరం జెసి కార్తీక్‌ మాట్లాడుతూ, ఓటు ప్రాముఖ్యతను తెలియ జేసేందుకు స్వీప్‌ కార్యక్రమం కింద వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 13 వరకు స్వీప్‌ కార్యక్రమాలను వివిధ రూపాల్లో కొనసాస్తామని చెప్పారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, ఎన్నికల్లో మహిళలంతా తమ ఓటుహక్కును వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.మల్లయ్య నాయుడు, సహాయ కమిషనర్‌ తిరుమలరావు, స్వీప్‌ నోడల్‌ ఆఫీసర్‌ శ్రీనివాస రావు, మెప్మా పిడి సుధాకరరావు పాల్గొన్నారు.

➡️