ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యేకు వినతి

Jun 30,2024 21:36

 ప్రజాశక్తి- శృంగవరపుకోట : తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్తు మీటర్‌ రీడర్‌ కార్మికులు ఆదివారం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు లక్కవరపుకోటలో ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆమెకు తొలుత శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్తు మీటర్‌ రీడర్‌ కార్మికులుగా గత 20 సవంత్సరాలగా విద్యుత్తు సంస్థలో పనిచేస్తున్నామని, 2018లో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు తమ సమస్యలను వివరించగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఇందన శాఖ మంత్రి కళా వెంకట్రావు విద్యుత్తు సంస్థలో పని చేస్తున్న మీటర్‌ రీడర్లను -రీడింగ్‌తో పాటు బిల్‌ కనెక్షన్‌ కూడా చేస్తూ నెలరోజుల పనిని కల్పించే విధంగా జీవో ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో గవర్నమెంట్‌ మారడంతో తమకు కష్టాలు మొదలయ్యాయని టిడిపి ఇచ్చిన జీవో పనిచేయదని రద్దు చేశారని చెప్పారు. రూ. 3.60 పై పెంచిన పీస్‌ రేటును తగ్గించడంతో పాటు తమకు రావలసిన అరకొర వేతనాల్లో కూడా వైసిపి కాంట్రాక్టర్‌లు దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. తమ మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టి మీటర్‌ రీడర్లకు పని దినాలు తగ్గించి తమ కడుపు కొట్టారన్నారు. ఈ సమస్యలను ముఖ్యమంత్రి వద్దకు తీసుకువెళ్లి తమకు ఉద్యోగ భద్రత కల్పించి నెలవారి వేతనాలు అమలు చేయాలని విన్నవించారు.

➡️