రిమ్స్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతా

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/రాయచోటిరిమ్స్‌ను జాతీయ సంస్థగా తీర్చిదిద్దుతామని టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం రాత్రి అన్నమయ్య, రాయచోటి, కడప జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన ప్రజాగళంసభలో ఆయన మాట్లాడుతూ మరాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు న్నారని, అటువంటి వారికి ఇసుక విధానం లోపబూయిష్టం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే జూన్‌ నాలుగు నుంచి ఉచిత ఇసుక విధానం అమలు చేస్తామని తెలిపారు. తాను శంకుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమకు మరోసారి శంకుస్థాపన చేసి ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. ఇడుపులపాయలో 350 ఎకరాలు, లేపాక్షిలో 10 వేల ఎకరాలు, గుంటూరులో 27 వేల ఎకరాలు, బ్రహ్మణీలో 10 వేల ఎకరాలను కొట్టేశారన్నారు. దీంతోపాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రింగు రోడ్ల సమీపంలో, రాయచోటి డ్రెయినేజీ పనుల పేరుతో రూ.200 కోట్లు చొప్పున స్వాహా చేశారని ఆరోపించారు? రాష్ట్రంలో ముస్లిముల సంరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలతోపాటు ఉచిత స్థలం, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కడప హౌజ్‌హౌస్‌ను 90 శాతం పూర్తి చేశామని, మైనార్టీ మంత్రిగా ఉన్న కడప ఎమ్మెల్యే 10 శాతం పనులను ఎందుకు చేపట్టలేకపోయారని నిలదీశారు. సైకో జగన్‌ పాలన వల్లే ఆంధ్ర అనాధగా మారిందన్నారు. పరిశ్రమలు పారిపోతున్నాయని చెపాపరు. నవరత్నాల పేరుతో నవమోసాలకు పాల్పడుతున్న వైనాన్ని ఏకరువు పెట్టారు. వైసిపి ఎంపీ పి.మిధున్‌రెడ్డి పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాలపై ఓటు వేసిన ఘనత వహించారన్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉండదనే అపోహ లను నమ్మరాదని చెప్పారు. రాయచోటిలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తానని, విదేవీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన రిజ ర్వాయర్లు పూర్తి చేస్తామన్నారు. చిన్నమండెంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి. పాలిటెక్నికల్‌ కళాశాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. చిత్తూరు రోడ్డులో రింగ్‌ రోడ్డులో శ్రీకాంత్‌రెడ్డి రూ.200 కోట్లు భూములు కబ్జా చేశారన్నారు. కడప జిల్లాలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేని వైఎస్‌ జగన్‌ కడప, రాయలసీమ ద్రోహిగా నిలిచా డన్నారు. కడప జిల్లాకు పరిశ్రమలు వెల్లువెత్తిస్తామని చెప్పారు. ఆయా చోట్ల నిర్వమించిన ప్రజాగళం సభల్లో మాజీ ముఖ్యమంత్రిమ కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌.మాధవి, ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాజపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌రాజు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.మరోసారి శంకుస్థాపన చేసి ఎందుకు నిర్మించలేదో చెప్పాలని నిలదీశారు. ఇడుపులపాయలో 350 ఎకరాలు, లేపాక్షిలో 10 వేల ఎకరాలు, గుంటూరులో 27 వేల ఎకరాలు, బ్రహ్మణీలో 10 వేల ఎకరాలను కొట్టేశారన్నారు. దీంతోపాటు అన్నమయ్య, చిత్తూరు జిల్లాల రింగు రోడ్ల సమీపంలో, రాయచోటి డ్రెయినేజీ పనుల పేరుతో రూ.200 కోట్లు చొప్పున స్వాహా చేశారని ఆరోపించారు? రాష్ట్రంలో ముస్లి ముల సంరక్షణకు పెద్దపీట వేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాలతోపాటు ఉచిత స్థలం, ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. కడప హౌజ్‌హౌస్‌ను 90 శాతం పూర్తి చేశామని, మైనార్టీ మంత్రిగా ఉన్న కడప ఎమ్మెల్యే 10 శాతం పనులను ఎందుకు చేపట్టలేకపోయారని నిలదీశారు. సైకో జగన్‌ పాలన వల్లే ఆంధ్ర అనాధగా మారిందన్నారు. పరిశ్రమలు పారిపో తున్నాయని చెపాపరు. నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతున్న వైనాన్ని ఏకరువు పెట్టారు. వైసిపి ఎంపీ పి.మిధున్‌రెడ్డి పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాలపై ఓటు వేసిన ఘనత వహించారన్నారు. రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉండదనే అపోహ లను నమ్మరాదని చెప్పారు. రాయచోటిలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పా టు చేస్తానని, విదేవీ విద్య పథకాన్ని పునరుద్ధరిస్తామని తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన రిజ ర్వాయర్లు పూర్తి చేస్తామన్నారు. చిన్నమండెంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేసి. పాలిటెక్నికల్‌ కళాశాలను పునరుద్ధరిస్తామని తెలిపారు. చిత్తూరు రోడ్డులో రింగ్‌ రోడ్డులో శ్రీకాంత్‌రెడ్డి రూ.200 కోట్లు భూములు కబ్జా చేశారన్నారు. కడప జిల్లాలో ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేని వైఎస్‌ జగన్‌ కడప, రాయలసీమ ద్రోహిగా నిలిచా డన్నారు. కడప జిల్లాకు పరిశ్రమలు వెల్లువెత్తిస్తామని చెప్పారు. ఆయా చోట్ల నిర్వమించిన ప్రజాగళం సభల్లో మాజీ ముఖ్యమంత్రిమ కిరణ్‌కుమార్‌రెడ్డి, రాయచోటి అసెంబ్లీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్‌.మాధవి, ఎంపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డి మాట్లాడారు. ఆయా కార్యక్రమాల్లో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, రాజపేట పార్లమెంట్‌ అధ్యక్షులు చమ్మర్తి జగన్మోహన్‌రాజు, పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

➡️