రోడ్డు ప్రమాదం – పలువురికి గాయాలు

Apr 2,2024 13:58 #injured, #road accident, #Tenali

ప్రజాశక్తి-తెనాలి రూరల్‌ (గుంటూరు) : తెనాలి మండలం హాఫ్‌ పేట వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. హనుమాన్‌పాలెం నుంచి గుంటూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్‌ను, ఆ వెనక వస్తున్న కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌ వెనుక ఉన్న వ్యక్తితోపాటు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు కూడా గాయాలయ్యాయి. ఒకరికి చేయి విరగగా, మరొకరి కాలికి గాయమయ్యింది. బస్సు డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్పందించిన గ్రామస్తులు వెంటనే గాయపడినవారందరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం సంభవించినట్లు తెనాలి రూరల్‌ ఎస్సై పి కోటేశ్వరరావు తెలిపారు. ప్రమాదంలో బైక్‌తోపాటు కారు నుజ్జునజ్జయింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

➡️