కృంగిన ఆర్/బి రోడ్డు

Dec 9,2023 15:00 #East Godavari
road crack down in road

ప్రజాశక్తి-పెరవలి మండలం (తూర్పుగోదావరి జిల్లా) : నిడదవోలు -నరసాపురం ఆర్/బి రోడ్డు ఉసులుమర్రు, తీపర్రు గ్రామల మధ్య నరసాపురం మొయిన్ కెనల్ వైపు రెండు చోట్ల దిగబడిపోయినది. ఈ మెయిన్ రోడ్డు కానూరు నుండి కాకరపర్రు వరకు గత ఏడాది తారు రోడ్డు వేసిన నాటినుండి నేటివరకు పలుచోట్ల గోతుల పడి కృంగుతోంది నిత్యము రోడ్డుపై పంగిడి ఏరియా ప్రాంతం నుండి క్వారీ కంకర లారీలు లోకల్ ఇసుక ర్యాంపుల పెండ్యాల-కానూరు తీపర్రుల నుండి ఇసుక ర్యాంపు భారీ ఇసుక లారీలు ప్రతినిత్యం వందల సంఖ్యలో వెళ్లడంతో రోడ్డు మెయిన్ కెనల్ వైపు కృంగుతుంది మరొక పక్క రోడ్డు గోతులమైయింది. అధికారులు స్పందించి పడిన గోతులు కాలువ వైపు కృంగిన రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని పలువురు కోరుచున్నారు.

➡️