వి.ఆర్.పురంలో రోడ్ల పరిస్థితి అద్వాన్నం

road problem in vr puram

పట్టించుకొని ప్రభుత్వం… నిత్యం నరకం అనుభవిస్తున్న మండల వాసులు

ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని అధికారులు

గిరిజనులగ్రామాల్లో అభివృద్ధి ఇదే నా అని మండలగిరిజన నేతల విమర్శ.

ప్రజాశక్తి-వి.ఆర్.పురం:నవంబర్24 మండల కేంద్రంలో ప్రధాన రహదారి రేఖపల్లి నుండి కూనవరం రోడ్డు ఉమ్మడి రాష్ట్రంలో వున్నప్పుడు వేశారు తప్ప ఇప్పటి వరకు వేసే ఆలోచన ప్రభుత్వనికి లేదు. ప్రధాన రహదారుల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం మర్చి పోయింది. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఐ.టి.డి.ఏ.గిరిజన ప్రజలు సామాజికం సంక్షేమ పథకాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. గిరిజనులు ఎంత వరకు అభివృద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్‌లోని గిరిజన జనాభా 50.24 లక్షలు రాష్ట్ర మొత్తం జనాభాలో 6.6 శాతం. ఈ నివేదిక గిరిజన జాబితా మరియు ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ తెగల జిల్లాల వారీ జనాభాను కలిగి ఉంది. 1998లో ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టాన్ని 1994లో సవరించి షెడ్యూల్డ్ ప్రాంతాలలో స్థానిక పాలన కోసం “పిసా” చట్ట యొక్క నిబంధనలను పొందుపరిచింది. ఈ చట్టంలో భాగంగా గ్రామసభలు, గ్రామ పంచాయతీలు మరియు మండల ప్రజా పరిషత్‌లకు ప్రత్యేక అధికారాలు మరియు “విధులు అప్పగించబడ్డాయి. మరి గ్రామాల్లో అభివృద్ధి ఏది గ్రామాల్లో అభివృద్ధి కి రోడ్లు అవసరం లేదా అభివృద్ధి అంటే వందమంది జనాలు ఉంటే ముగ్గురు ఖాతా లలో డబ్బులు వేయటమా…? రాష్ట్ర రోడ్ల పరిస్థితి ఎలావుందో అందరికి తెలుసు. వి.ఆర్.పురం మండలంలో గ్రామలలో అంతర్గత రోడ్లకు దిక్కులేదు కనీసం గ్రామ లకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం కూడా చేయలేని పరిస్థితి. నిధులు లేమితో పంచాయతీ లు మండల ప్రజాపరిషత్ మూలుగుతున్నాయి. ఒకప్పుడు కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్మాణలు చేయాలంటే ఎంతో ఉత్సాహంగా పోటీపడేవారు ఇప్పుడు పిలిచి” పని “ఇస్తామంటున్న చేయడానికి ముందుకు రావడం లేదు. అధికారంలో ఉన్న పార్టీ కార్యకర్తలే కాంట్రాక్టర్లు కానీ వారు కూడా బిల్లులు వస్తాయనే నమ్మకం లేక వారు కూడా ఈ వ్యవహారం లో తలపెట్టటం లేదు. మొద్దులగూడెం నుండి చుక్కనపల్లి వరకు రహదారి లో గోతులతో “కల కల “లాడుతున్నాయి. పెదమట్టపల్లి నర్సంపేట వరకు ఉన్న రోడ్డు నిర్మాణానికీ మూడు సంవత్సారాలు క్రితం పెద్దమట్టపల్లి గ్రామంలోని ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి మీదుగా రోడ్డు నిర్మాణానికి రోడ్డు మీద కంకరు పోసి శంఖుస్థాపన చేశారు. మూడు సంవత్సరాలుగా వస్తున్న నేటికీ రహదారి నిర్మించలేదు మంచిగా ఉన్న రోడ్డు ను అడ్డగోలుగా త్రవ్వి ఇలా మాకు రహదారి లేకుండా చేశారని తెల్లంవారిగూడెం గ్రామ గిరిజనులు అవేదన వ్యక్తం చేశారు . రోడ్డు వెంట త్రవ్వి వదిలేసిన రాళ్ళు అడుగడుగునా వర్షాలు కురిస్తే మోకాటి లోతు బురద .మిగతా కాలంలో గోతుల తో 20కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రం వి.ఆర్. పురం వెళ్లాలంటే వాహనాల రాకపోకలకు జనం ప్రయాణికులు చు ట్టు ప్రక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులూ పడాల్సి వస్తుందనీ గిరిజనులు మొర పెట్టుకుంటున్నారు. కుందులూరు గ్రామ పంచాయితీల పరిధిలోని 14 గ్రామాల ప్రజల రహదారి సౌకర్యాలు లేవు. ఈ గ్రామాల నుండి మండల కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 20 కి.మీ. ఉంటుంది. ఈ గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు, మరియు ప్రభుత్వ ఆసుపత్రి బ్యాంకు లకు నిత్యఅవసరాల నిమిత్తం వెళ్లాలన్న ప్రజలు నానా అవస్థలు పడుతున్నదుస్థితి నెలకొన్నది. ప్రభుత్వ అధికారులు పంటించుకోడం లేదు. తక్షణమే అట్టి రోడ్లు పూర్తి చేయాలని పెద్ద మట్టపల్లి నుండి నర్సింగపేట వరకు బి.టి. రోడ్డు 16.2 కి.మీలకు నిధులు 4 కోట్ల. 33 లక్షలు మంజూరు అయిన త్రవి వదిలేసి సుమారు 3 సం॥రాలు అవుతున్నది. దీనిని తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. 2.తెల్లవారిగూడెం నుండి గుల్లేటివాడ వరకు బి.టి. రోడ్డు సుమారు 3.2 కి.మీ నిధులు రూ. 159.29 లక్షలు మంజూరు అయిన రోడ్డు పై మెటల్ పరిచ్చి 2నం॥ రాలు అవుతున్నది. దీనిని తక్షణమే పూర్తి చేయాలి. కారంగూడెం బి.టి. రోడ్డు జంక్షన్ నుండి ఎ.జి. కోడేరు వరకు రోడ్డు మరమత్తులు చేయుట గురించి కుందులూరు బి.టి. రోడ్డు నుండి జల్లివారిగూడెం వరకు మెటల్ రోడ్డుకు నిధులు మంజూరు. కందులూరు నుండి టేకులూరు వరకు మెటల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి గొల్లగూడెం నుండి వీరపాపనకుంట వరకు మెటల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి. జల్లివారిగూడెం నుండి బంగారుగూడెం రోడ్డు కూడా నడవలేని పరిస్థితి.కొన్ని కోట్ల రూపాయలు గిరిజన లకు ఖర్చు పెడుతున్నామని చెపుతున్నారు తప్ప ప్రభుత్వ అధికారులు నాయకులు కనీసం చిన్న గ్రామాలకు రహదారులు వేయలేని దుస్థితిలో వున్నారు. ఓట్ల పండుగ వస్తుంది .ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామ లలో రోడ్లు నిర్మించాలని గిరిజనులు కోరుతున్నారు.

➡️