ఘనంగా సరోజినీ నాయుడు వర్ధంతి వేడుకలు

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : కశింకోట మండలం సోమవరం గ్రామంలో భారత కోకిల స్వతంత్ర సమరయోధురాలు కవియిత్రి సరోజినీ నాయుడు వర్ధంతి వేడుకులను రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి సోమవారం గ్రామ మాజీ సర్పంచ్‌ గొంతిని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సరోజినీ నాయుడు చిత్రపటానికి గొంతిని శ్రీనివాసరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ … సరోజినినాయుడు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక వ్యక్తి అని అన్నారు. కవయిత్రిగా ఆమె చేసిన కృషికి మహాత్మ గాంధీ నుండి నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియా బిరుదు లభించిందని చెప్పారు. దీనితో పాటు మహిళా విముక్తి పౌర హక్కుల, వలసవాద వ్యతిరేకతకు సంబంధించి క్రియాశీలతకు కూడా గుర్తుండిపోయిందన్నారు. రాజ్యాంగం ముసాయిదా రచయిత కవి అని, స్త్రీలకు ప్రతి చోట మార్గనిర్దేశాకురాలు అని కొనియాడారు. విద్యార్థులను స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రేరేపించారని తెలిపారు. ఆమె వితంతువుల హక్కుల కోసం పోరాడారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు రైతు అధికార ప్రతినిధి ఉగ్గిని రమణ మూర్తి, నైనముసెట్టి రమణారావు, ఉల్లింగల రమేష్‌, మాజీ సర్పంచ్‌ కర్రి దుర్గునాయుడు, జెర్రిపోతుల నూకునాయుడు, కోన రమణ, కోన మాణిక్యం, తాడేలు సూరిబాబు, నానాజీ, బాలకృష్ణ, పెద్దలు పాల్గొన్నారు.

➡️