నేటి నుంచి షర్మిల బస్సుయాత్ర

ప్రజాశక్తి-కడప పతినిధి/వేంపల్లె/కాశినాయనపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల శుక్రవారం నుంచి జిల్లాలో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ నెల ఐదు నుంచి 12వ తేదీ వరకు కడప పార్లమెంట్‌ పరిధిలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దు టూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజ కవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ బస్సుయాత్ర ఉదయం 9.45 గంటల నుంచి రాత్రి 9.45 గంటల వరకు ప్రచారం సాగనుంది. ఐదవ తేదీన బద్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, గోపవరం మండలాల కేంద్రాల మీదుగా ఎన్నికల ప్రచారం సాగనుంది. ఆరు. బద్వేల్‌, అట్లూరు, కడప, ఏడున దువ్వూరు, చాపాడు, ఖాజీపేట, మైదుకూరు, బ్రహ్మంగారిమఠం, ఎనిమిదిన కమలాపురం, వల్లూరు, చెన్నూరు, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వీరపునాయునిపల్లి, 10న చక్రాయపేట, వేంపల్లి, వేముల, పులివెందుల, లింగాల, సింహాద్రిపురం, 11న తొండూరు, యర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైలవరం, 12న జమ్మలమడుగు, పెద్దముడియం, ప్రొద్దుటూరు, రాజుపాలెం మండలాల పర్యటనతో బస్సుయాత్ర ముగుస్తుంది. బస్సుయాత్రలో షర్మిలతో పాటు పిసిసి మీడియా చైర్మన్‌ ఎన్‌.తులసిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు గుండ్లకుంట శ్రీరాములు, బద్వేలు నియోజకవర్గం అభ్యర్థి విజయజ్యోతి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులతో పాటు సిపిఎం, సిపిఐ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయ కులు కూడా ఉంటారు. షర్మిల చేపట్టే బస్సు యాత్రకు ప్రతి ఒక్కరూ హజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు, బద్వేలు అసెంబ్లీ అభ్యర్థి ఎన్‌.డి.విజయజ్యోతి కోరారు. రాబోవు ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని వైసిపి ప్రభు త్వాన్ని గద్దె దింపి ఇంటికి పంపించాలని కోరారు. ఇటు కేంద్రంలో, అటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు వచ్చే విధంగా ప్రజలు అందరూ హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.నేటి పర్యటన వివరాలిలా…బద్వేలు నియోజ కవర్గంలోని కాశినాయన మండలంలోని అనుగంపల్లె వద్ద శుక్రవారం ఉదయం 9.30 గంటలకు బస్సుయాత్ర ప్రారంభం అవుతుంది. ఇటుకలపాడు, సావిశెట్టిపల్లె, ఆకుల నారాయణపల్లె, వరికుంట, బాలయ్యపల్లె మీదుగా మధ్యాహ్నం 12 గంటలకు మండల కేంద్రమైన నర్సాపురానికి చెరుకుంటుంది. గొటివారిపల్లె, గంగన్నపల్లె, మిద్దెలు గ్రామాల మీదుగా కలసపాడు మండలంలోకి చేరుకుంటుంది. కలసపాడులో సెయింట్‌ పాల్‌ చర్చిని మధ్యాహ్నం 3 గంటలకు సందర్శిస్తారు. అనంతరం మహానందిపల్లె, మామిళ్ళపల్లె, లింగారెడ్డిపల్లె, శంకవరం క్రాస్‌, మార్కాపురం మీదుగా సాయంత్రం 5.30 గంటలకు పోరుమామిళ్ళకు చేరుకుంటుంది. అక్కడ నుండి బి.కోడూరు మండలం పాయలకుంట్ల మీదుగా రాత్రి 7.45కు బద్వేలుకు బస్సుయాత్ర చేరుకుంటుంది. అక్కడ నుండి అట్లూరు మీదుగా కడపకు చేరుకుటుంది.

➡️