జిల్లా స్థాయి వేదిక్ అబాక‌స్ మ్యాథ్స్‌లో సౌమ్య ప్ర‌తిభ‌

Mar 10,2024 16:34 #Kurnool

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : ఆదోనిలోని మల్లికార్జున స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి వేదిక్, అబాకస్ మ్యాథ్స్ పోటీలలో ఆదోనిలోని వాగ్దేవి స్కూల్ విద్యార్థిని సౌమ్య ప్రథమ, అబాకస్ మ్యాథ్స్‌లో విద్యార్థి సుకుమార్ ద్వితీయ స్థానాల్లో నిలిచార‌ని హెచ్ఎం సురేష్ తెలిపారు. ఆదివారం పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన అభినంద‌న స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. పోటీ ప‌రీక్ష‌లు విద్యార్థుల్లో ఉన్న భ‌యం తొల‌గిపోతుంద‌న్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధు, శిరీష, నవ్య, అశ్విని, సంధ్య పాల్గొన్నారు.

➡️