మసీదుల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు

  •  ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ

ప్రజాశక్తి -నెల్లూరు : రంజాన్ పండుగ నేపథ్యంలో నెల రోజులపాటు జరగనున్న ఉపవాస దీక్షలకు మసీదుల వద్ద అవసరమైన పారిశుద్ధ్య నిర్వహణ పనులను ప్రత్యే కంగా నిర్వహిస్తున్నామని ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ తెలిపారు. స్థానిక చిన్న బజార్, కోటమిట్ట ప్రాంతాల్లోని మసీదుల వద్ద జరుగుతున్న పారిశుద్ధ్య నిర్వ హణ పనులను డాక్టర్ గురువా రం పర్యవేక్షించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని మసీదుల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచి, స్థానికంగా బ్లీచింగ్, సున్నం చల్లే పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. పందులు, వీధి కుక్కలు నియం త్రణకై ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నామన్నారు. దోమల నిర్మూలనకై ఫాగింగ్, మందు పిచికారి క్రమంతప్పకుండా చేయిస్తున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ సై అవగాహన పెంచుకుని, నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల వాడకాన్ని ప్రజలంతా తగ్గించుకోవాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్ విక్రయాలు జరిపితే దుకాణాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిషేధిత ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ, రవాణా, నిల్వ, విక్రయం, కొనుగోలు చట్టవ్యతిరేకమైన చర్యలని ప్రజలంతా అవగాహన పెంచుకుని, బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. నిషేధిత ఉత్పత్తులపై తమకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేసారు.

➡️