క్రీడ‌లు స్నేహాభావాన్నిపెంచుతాయి : తిమ్మ‌ప్ప‌

Mar 10,2024 16:54 #Kurnool, #Sports

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : క్రీడ‌లు ఆయా ప్రాంతాల క్రీడాకారుల మ‌ధ్య స్నేహాభావాన్ని పెంచుతాయ‌ని టీడీపీ పిసి సెల్ రాష్ట్ర ప్రచార ప్రతినిధి బంక తిమ్మ‌ప్ప‌, ఒక‌ట‌వ వార్డు టిడిపి ఇన్చార్జీ వెంక‌టేష్ అన్నారు. ఆదివారం మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా డి స్ట్ర‌యిక‌ర్ టీం ఆధ్వ‌ర్యంలో ఆదోనిలోని శ్రీ‌జీహ్వేశ్వ‌ర పాఠ‌శాల మైదానంలో నిర్వ‌హించిన క్రికెట్ టోర్నీలో విజేత‌ల‌కు మారుతి నాయుడు రూ.20 వేలు, బ‌త్తిని కుబేర్నాథ్‌ రూ.15 వేలు, కొంకా సిద్దార్థ నాయుడు రూ.10 వేలు స్పాన్స‌ర్ చేయ‌గా విజేతలకు అంద‌జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు చదువుతోపాటు క్రీడల్లో కూడా యువత ప్రతిభ చూపితే ఉద్యోగ అవకాశాలలో ప్రాధాన్యత ఉంటుందన్నారు ప్రతి ఏడాది వివిధ రకాల టోర్నమెంట్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు తెలుగుదేశం కార్యకర్తలు వీరేష్, జయరాం, వెంకటేష్, నాగేంద్ర ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన‌ టోర్నమెంట్లో మొదటి బహుమతి వాల్మీకి జేఎంఆర్ టీం, రెండో బహుమతి డి స్ట్ర‌యిక‌ర్, మూడో బహుమతి ఎన్ఎస్ గౌస్ టీం సాధించారు.

➡️