వ్యాక్సినేషన్‌పై వైద్యాధికారి ఆకస్మికంగా తనిఖీ

May 22,2024 15:09 #aasha workers, #Annamaiya district

ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య) : మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాపి రెడ్డి గారి పల్లి సచివాలయంలో డాక్టర్‌ పి.జోహార్‌ బాబు ఆధ్వర్యంలో రెగ్యులర్‌ అవుట్‌ రిచ్‌ వ్యాక్సినేషన్‌ సెషన్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ వ్యాక్సినేషన్‌ రిజిస్టర్లు వ్యాక్సిన్‌ క్యారియర్‌లోని వ్యాక్సిన్‌ను గర్భవతులు మరియు బాలింతల ఎం.సి.పి. కార్డులను పరిశీలించి అందులో లోపాలను గుర్తించి సరి చేసుకోమని ఆరోగ్య కార్యకర్తకు తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈరోజు వ్యాక్సిన్‌ వేసిన పిల్లలు మరలా సెషన్‌కి ఎప్పుడు రావాలి ఎంత మోతాదు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి అనే వివరాలు ఎం.సి.పి. కార్డులో పొందుపరిచి తల్లులకు తెలియజేశారు. పోలియో చుక్కలు, పెంట వ్యాక్సిన్‌, రోటా వ్యాక్సిన్‌, మేజిల్స్‌ వ్యాక్సిన్‌, టీటీ వ్యాక్సిన్‌, కంటి జబ్బులు రాకుండా తదితర మందులన్నీ పిల్లలకు ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్‌ ఈ ఓ జి జయరామయ్య, పీహెచ్‌ఎన్‌ కే.సుబ్బరత్నా, ఆరోగ్య కార్యకర్త ఎన్‌.వాణి, ఆశా కార్యకర్తలు టి.గురు, శాంత ఎం.రేష్మా బేగం, జే.రవణమ్మ, కే.పార్వతి పాల్గొన్నారు.

➡️