ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి : సిఐటియు

Dec 12,2023 21:46

 వినతిపత్రం అందజేస్తున్న ఆశాలు, నాయకులు

                       హిందూపురం : ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు జెడ్‌పి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 14,15 తేదీల్లో ఆశాల ధర్నా, 36 గంటల వంటావార్పు కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరుతు నియోజక వర్గ వ్యాప్తంగా ఉన్నా అన్ని ప్రాధమిక ఆరోగ్య ఉప కేంద్రాల వైద్యాధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నామని చెప్పారు. హిందూపురం రూరల్‌ మండలం చౌళూరు పిహెచ్‌సిలో జరిగిన కార్యక్రమంలో జెడ్‌పి శ్రీనివాసులు, ఆశ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు మాట్లాడుతు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14, 15 తేదీలలో జిల్లావైద్యాధికారి కార్యాలయం ఎదుట 36 గంటల వంటా, వార్పు, ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆశాలకు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్‌, గ్రూప్‌ ఇన్యూరెన్స్‌ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు రాజప్ప, ఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు రాధ, భూమిక, పధ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️