ఉద్యోగుల ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలి : యుటిఎఫ్‌

Dec 27,2023 22:02

మడకశిరలో యుటిఎఫ్‌ నాయకుల నిరసన

                  మడకశిర : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహశీల్దార్‌కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు భూతన్న, మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వి.ఎన్‌. మాలింగప్ప, వై. జోగప్ప, గుడిబండ మండల అధ్యక్షులు డి. నరసింహప్ప, నరసింహమూర్తి, బి. ఈశ్వర్‌, పి. ఓబన్న, వెంకటరమణ, సూర్య ప్రకాష్‌, సురేష్‌, సుదర్శన్‌, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. కదిరి టౌన్‌ :ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలనీ యుటిఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు వారు బుధవారం కదిరి తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి డి. శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహెర్‌ వలి, మధుసూదన, భార్గవ, జబివుల్లా, కిషోర్‌, ఫయాజ్‌, బ్రహ్మేంద్ర, రవి వర్ధన్‌ రెడ్డి, నజీర్‌బాషా, ఆజం భాష, రియాజ్‌, రాంప్రసాద్‌ నాయక్‌, ఖాజా మొహిదీన్‌, రమణ నాయక్‌, చైతన్య, సునీల్‌ కుమార్‌, వెంగమ నాయుడు, సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు. ధర్మవరం టౌన్‌ : ప్రతినెలా 1వతేదీన వేతనాలు చెల్లించాలని యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ధర్మవరం జోన్‌ యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవారం నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా శెట్టిపి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతినెల 1వతేదీన జీతాలు చెల్లించాలని, పెండింగ్లో ఉన్న అన్నిరకాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్లతోకూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌ యుగేశ్వరీదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ ధర్మవరం జోన్‌ నాయకులు రామకృష్ణనాయక్‌, ఆంజనేయులు, హరికృష్ణ, గోపాల్‌రెడ్డి, సకలచంద్రశేఖర్‌, పెద్దకోట్ల సురేశ్‌, హరిశంకర్‌, రవిశేఖర్‌, ఆదిశేషు, ఆంజనేయులు, బాలాజీ పాల్గొన్నారు. పెనుకొండ : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా సుధాకర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు దాదాపు 18 వేల కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు చెల్లించలేదన్నారు. వెంటనే వీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సీనియర్‌ అసిస్టెంట్‌ సత్యనారాయణకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నరేష్‌, నారాయణ స్వామి, హసీనా బేగం, క్రిష్ణా నాయక్‌, రమేష్‌, ఉపేంద్ర, గంగాధర్‌, మారుతీ, రవీంద్రనాథ్‌, రామాంజినేయులు, నరసింహుడు, ఆదిజినేష్‌, గోవిందప్ప, రాధమణి వెంకటేష్‌, ప్రభాకర్‌ నాగేంద్ర, జె.నరేష్‌, బాషా, తదితరులు పాల్గొన్నారు.

➡️