కలసికట్టుగా పనిచేద్దాం : బికె

Mar 26,2024 22:11

 సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారధి

                 పెనుకొండ : వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం అందరం కలసి కట్టుగా పనిచేద్దామని హిందూపురం పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి బికె. పార్థసారథి పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బికె. పార్థసారథి అధ్వర్యంలో పెనుకొండ నియోజకవర్గ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిశీలకులు డాక్టర్‌ నరసింహ రావు, ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ ఎన్నికల సంగ్రామంలో సైనికుల్లా పని చేద్దామన్నారు. వచ్చే ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గ, హిందూపురం పార్లమెంటు అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్టీలో ఎలాంటి గ్రూపులు ,విభేదాలు లేవని అందరూ కలిసి కట్టుగా పని చేద్దామని ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వైసిపి పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురుబ కృష్ణమూర్తి, పార్టీ మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పలువురు టిడిపిలో చేరిక : పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో హిందూపురం పార్లమెంటు కూటమి అభ్యర్థి బికె. పార్థసారథి సమక్షంలో నియోజకవర్గములోని గోరంట్లకు చెందిన పలువురు టిడిపిలో చేరారు. మౌలాలి, బాచాన్నపల్లి గ్రామానికి చెందిన సాబ్‌ జాన్‌తో పాటు 5 కుటుంబాలు వైసిపి నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు.ఈ సందర్బంగా పార్టీ లోకి చేరిన వారికి పార్థసారథి టిడిపి కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌ సోమశేఖర్‌, నాయకులు పాల్గొన్నారు.

➡️