చదువుతోపాటు క్రీడలు అవసరం

Jan 5,2024 22:05

బాస్కెట్‌బాల్‌ క్రీడాకారులతో కోచ్‌లు, ట్రస్టు సభ్యులు

                     ధర్మవరం టౌన్‌ : చదువుతో పాటు క్రీడలు చాలా అవసరమని ఆత్మీయట్రస్టు చైర్మన్‌, యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రారెడ్డి క్రీడాకారులకు సూచించారు. స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నతపాఠశాల క్రీడామైదానంలో అండర్‌-12 బాస్కెట్‌బాల్‌ జిల్లా స్థాయి లీగ్‌ పోటీలను శుక్రవారం నిర్వహించారు.ఈ పోటీలను ఆత్మీయట్రస్టు చైర్మన్‌ శెట్టిపి జయచంద్రారెడ్డి, బాస్కెల్బాల్‌ అసోషియేషన్‌ కార్యదర్శి వాయల్పాడు హిదయతుల్లా ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు మానసిక,శారీరక ఉల్లాసాన్ని ఇస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్‌లు సంజరు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️